ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్ ఈ మధ్య ఏపీ అంతా యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. య
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్ ఈ మధ్య ఏపీ అంతా యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. యువగళం పేరిట ఆయన సాగిస్తున్న యాత్ర వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీని గెలిపించాలనే లక్ష్యంతో సాగుతున్నది. ముఖ్యంగా ఆయన వెళ్ళిన ప్రతీ చోట యువతతో ముచ్చటిస్తున్నారు.
ఈ రోజు ఆయన మంగళగిరిలో విద్యార్థులు, యువతతో ముఖాముఖి నిర్వహించారు. ఆ కార్యక్రమంలో విద్యార్థులు ఆయనపై అనేక రకాల ప్రశ్నలు సంధించారు. అందులో రాజకీయాలే కాకుండా వ్యక్తిగత విషయాలు కూడా ఉండటం విశేషం.
ఓ టీనేజ్ అమ్మాయి అడిగిన ప్రశ్నకు లోకేష్ కాసేపు సిగ్గుపడ్డారు. జనం కేరింతల మధ్య ఆయన జావాబు చెప్పారు. ఇంతకూ ఆ అమ్మాయి అడిగిన ప్రశ్న దానికి లోకేష్ చెప్పిన సమాధానం ఏం టంటే…
బ్రాహ్మణి గారితో పెళ్ళి ప్రస్తావన మొదటిగా ఎవరు తీసుకొని వచ్చారు అని ఆ టీనేజ్ అమ్మాయి ప్రశ్నించింది. దాంతో సభ మొత్తం కేరింతలతో నిండిపోయింది. ఆమెసడెన్ ప్రశ్నతో కొద్దిగా సిగ్గుపడ్డ లోకేష్ తర్వాత ఆ ప్రశ్నకు జవాబు చెప్పాడు. తమది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని. అయితే తన మామయ్యం బాలకృష్ణను అడిగే ధైర్యం తనకు లేదని చెప్పారు. తమ ఇద్దరికీ పెళ్ళి చేయాలనే ప్రతిపాదన మామయ్య కుటుంబం నుంచి వచ్చిందని మా ఇంట్లో వాళ్ళు ఒక రోజు తనకు చెప్పి అభిప్రాయం అడిగారని చెప్పిన లోకేష్ ”నా అభిప్రాయమేంటో మీకు తెలుసు కదా” అని సభికులనే ప్రశ్నించారు.