HomeTelangana

గద్దర్ పై కాల్పులు జరిపించింది నేను కాదు -చంద్రబాబు

గద్దర్ పై కాల్పులు జరిపించింది నేను కాదు -చంద్రబాబు

తెలుగు దేశం అధ్యక్షుడు చంద్ర బాబు ప్రజా గాయకుడు గద్దర్ కు నివాళులు అర్పించారు. హైదరాబాద్, అల్వాల్ లోని గద్దర్ ఇంటికి వెళ్ళిన చంద్రబాబు గద్దర్ చిత్ర ప

జగన్ రెడ్డీ…అంటూ అన్నపై నిప్పులు చెరిగిన షర్మిల‌
గద్దర్ మృతికి ప్రముఖుల సంతాపం
దళితుడు ఇంట్లోకి వస్తే ఆవు మూత్రంతో ఇంటిని శుభ్రం చేసుకునే వ్యక్తి కేసీఆర్ -మోత్కుపల్లి సంచలన కామెంట్స్

తెలుగు దేశం అధ్యక్షుడు చంద్ర బాబు ప్రజా గాయకుడు గద్దర్ కు నివాళులు అర్పించారు. హైదరాబాద్, అల్వాల్ లోని గద్దర్ ఇంటికి వెళ్ళిన చంద్రబాబు గద్దర్ చిత్ర పఠానికి పూలమాలవేసి శ్రద్దాంజలి ఘటించారు. గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన బాబు వారికి ధైర్యవచనాలు చెప్పారు. గద్దర్ ఇంటికి వెళ్ళినవారిలో చంద్రబాబుతో పాటు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ కూడా ఉన్నారు.

అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, 1997 లో గద్దర్ పై జరిగిన కాల్పుల సంఘటన గురించి తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ప్రజల్లో తనపై అపోహలు సృష్టిస్తున్నారని అన్నారు. ఆ తర్వాత గద్దర్ తనతో చాలా సార్లు కలిశారని, గద్దర్ తాను కలిసి పని చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. పేదల హక్కుల పరిరక్షణే మాఇద్దరి ల్క్ష్యమని చంద్రబాబు తెలిపారు.

గద్దర్ అంటే భయంలేని వ్యక్తి అని, ప్రజల కోసం పోరాటాలే ఆయన ఊపిరి అని ఆయనను చూస్తేనే ఓ ప్రజా యుద్ద నౌక గుర్తుకు వస్తుందన్నారు చంద్రబాబు. గద్దర్ మరణం తనను చాలా బాధించిందని, ఆయనలేని లోటు తీర్చలేనిదని, ఆయన భావితరాలకు నిరంతరం స్పూర్తిగా ఉంటారని చంద్రబాబు అన్నారు.

అది సరేగానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గద్దర్ పై కాల్పులు జరిగి ఆయన చావు అంచుల వరకు వెళ్ళి వచ్చారు. మరి గద్దర్ పై కాల్పులు జరిపిందెవరో బాబు ప్రభుత్వం ఎందుకు కనిపెట్టలేకపోయిందన్నది ఇప్పటికీ ప్రజలకు అర్దం కాని ప్రశ్న. కనీసం ఆ ప్రశ్నకైనా బాబు జవాబు చెప్తారా ?