HomeAndhra Pradesh

ఇకపై ప్రతి భక్తుడికి ఒక కర్ర ఇవ్వనున్న టీటీడీ … తిరుమలలో పులుల నుండి భక్తుల రక్షణకు చర్యలు

ఇకపై ప్రతి భక్తుడికి ఒక కర్ర ఇవ్వనున్న టీటీడీ … తిరుమలలో పులుల నుండి భక్తుల రక్షణకు చర్యలు

వెంకటేశ్వరుడిని దర్శించేందుకు కాలినడకన‌ తిరుమల కొండకు చేరుకునే భక్తులకు చిరుతల నుండి తీవ్ర ప్రమాదాలు ఎదురవుతున్నాయి. నాలుగు రోజులక్రితం లక్షిత అనే చి

కాంగ్రెస్ మార్క్ గూండాయిజం: కాంగ్రెస్ గ్రూపుల మధ్య కొట్లాట – జర్నలిస్టులను చితకబాదిన కాంగ్రెస్ నేతలు
మావోయిస్టుల దాడిలో చనిపోయిన పోలీసులు 35 మంది కాదు నలుగురే – అధికారుల ప్రకటన‌
ఇజ్రాయిల్ పై 5వేల రాకెట్లతో దాడి చేసిన హమస్

వెంకటేశ్వరుడిని దర్శించేందుకు కాలినడకన‌ తిరుమల కొండకు చేరుకునే భక్తులకు చిరుతల నుండి తీవ్ర ప్రమాదాలు ఎదురవుతున్నాయి. నాలుగు రోజులక్రితం లక్షిత అనే చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసిన నేపథ్యంలో తిరుమల తిరుపతి బోర్డు తీవ్ర భద్రతా చర్యలు చేపట్టింది.

టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలిసి భద్రతాపరమైన ఏర్పాట్లపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై కాలినడకన వెళ్ళే ప్రతి భక్తునికి ఒక కర్ర ఇవ్వాలని నిర్ణయించారు.

అలిపిరి, శ్రీవారి మెట్ల నడక దారిలో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటలవరకు మాత్రమే 12 ఏళ్లలోపు చిన్న పిల్లలను అనుమతిస్తారు. ఆ తర్వాత రాత్రి 10 గంటల వరకు పిల్లలను అనుమతించరు. పెద్దలు మాత్రం వెళ్ళొచ్చు. భక్తుల రక్షణ కోసం అటవీశాఖకు చెందిన నిపుణులైన సిబ్బందిని నియమించనున్నారు. భక్తుల నడక దారిలో 500 కెమరా ట్రాప్లు, అవసరమైతే డ్రోన్లను కూడా వినియోగించనున్నారు.

రోడ్డుకు ఇరువైపులా ఫోకస్ లైట్లు ఏర్పాటు చేయనున్నారు. ఆ లైట్ల ఫోకస్ దాదాపు 30 అడుగుల దూరం వరకు దూరం వరకు కనిపిస్తాయి. వైల్డ్‌లైఫ్‌ అవుట్‌ పోస్టులను ఏర్పాటుచేయడమే కాక‌, నిరంతరం యానిమల్‌ ట్రాకర్లను, వైద్యులను అందుబాటులో ఉంచనున్నారు.