HomeTelangana

తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు…హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు…హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ జారీ

పది రోజుల క్రితం వరకు వర్షాలు వరదలతో అతలాకుతలమైన తెలంగాణలో ఈ పది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. అయితే వాతావరణశాఖ అధికారులు మళ్ళీ తెలంగాణలో మూడురోజులప

తెలుగు వాళ్ళు ఈ నటిని బహిష్కరించాలి
ఫైర్ ఫైర్స్‌ది ఫైర్… ఎవరనుకున్నారు? కేఏ పాల్ ఇక్కడ
సంక్రాంతి: హైదరాబాద్-విజయవాడ హైవే కిక్కిరిసిపోయింది

పది రోజుల క్రితం వరకు వర్షాలు వరదలతో అతలాకుతలమైన తెలంగాణలో ఈ పది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. అయితే వాతావరణశాఖ అధికారులు మళ్ళీ తెలంగాణలో మూడురోజులపాటు భారీ వర్షాలు పడె అవకాశం ఉందని ప్ర్కటించారు.

ఆంధ్రప్రదేశ్‌ తీరంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, మయన్మార్‌, బంగ్లాదేశ్‌ దగ్గర ఉన్న మేఘాలను ఆకర్షిస్తుందని, ఆయా మేఘాలు తెలుగు రాష్ట్రాలపై ఆవరించి ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు నుంచి నుంచి మూడ్రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తున్నది.

ముఖ్యంగా హైదరాబాద్‌, మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అధికారులు ఈ ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.