వేఫేరర్ ఫిల్మ్స్, ZEE స్టూడియోస్ దుల్కర్ సల్మాన్ హీరోగా నిర్మించిన కింగ్ ఆఫ్ కోతా, 2023 ఆగస్టు 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా అ
వేఫేరర్ ఫిల్మ్స్, ZEE స్టూడియోస్ దుల్కర్ సల్మాన్ హీరోగా నిర్మించిన కింగ్ ఆఫ్ కోతా, 2023 ఆగస్టు 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన తొలి చిత్రం. ఇందులో ఐశ్వర్య లక్ష్మి మహిళా ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని, దగ్గుబాటి రానా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ ఓకే బంగారం సినిమాలో దుల్కర్ సల్మాన్ పాత్రకు తానే డబ్బింగ్ చెప్పానన్నాడు. తెలుగు ఇండస్ట్రీలో దుల్కర్ కొత్త స్థాయికి చేరుకుంటున్న తరుణంలో ఈ ఫంక్షన్‌కి రావడం ఆనందంగా ఉందని నాని అన్నారు. “నాకు పాన్ ఇండియా అనే పదం ఇష్టం లేదు. కానీ దుల్కర్ సల్మాన్ మాత్రమే పాన్ ఇండియా యాక్టర్ అని పిలుచుకునే ఏకైక హీరో.” అని వ్యాఖ్యానించారు.
ఎందుకు దుల్కర్ మాత్రమే పాన్ ఇండియా స్టారో కూడా నాని వివరించారు. అన్ని భాషల్లోని దర్శకులు దుల్కర్‌తో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారని, అదే పాన్ ఇండియన్ యాక్టర్‌కి నిజమైన నిర్వచనం అని నాని తెలిపారు. ”దుల్కర్ కోసం తమిళ దర్శకుడు కథ రాసుకుంటాడు, హిందీ దర్శకుడు కథ రాసుకుంటాడు, తెలుగు , మలయాళ దర్శకులు కథలు రాసుకుంటారు. ఒక పాన్ ఇండియా నటుడికి అసలైన నిర్వచనం ఇదే కదా !” అని నాని అన్నారు.
నాని మాట్లాడిన ఈ మాటలు టాలీవుడ్ యంగ్ హీరోల ఫ్యాన్స్ కు మంట పుట్టించాయి. టాలీ వుడ్ నుంచి ముందుగా పాన్ ఇండియా జెండా పాతింది ప్రభాస్ అని, ఆ తర్వాత రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ అని ఫ్యాన్స్ అంటున్నారు. సోషల్ మీడియాలో ఆ నలుగురు హీరోల ఫ్యాన్స్ నానిపై దాడి చేస్తున్నారు. ఎన్నడూ పాన్ ఇండియాకు ఎదగలేని నాని ఇలా కాకుండా ఇంకా ఎలా మాట్లాడతారని ఎగతాళి చేస్తున్నారు.