HomeTelangana

గ్రూప్ 2 పరీక్షలు వాయిదా… కేసీఆర్ ఆదేశాలు

గ్రూప్ 2 పరీక్షలు వాయిదా… కేసీఆర్ ఆదేశాలు

ఈ నెల 29, 30 తేదీల్లో జరగనున్న గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలంటూ గ్రూప్ 2 విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ముఖ్యమం కేసీఆర్ కీలక

గద్దర్ మరణం పట్ల KCR దిగ్భ్రాంతి
తాంత్రిక పూజల్లో కేసీఆర్ సిద్ధహస్తుడు
తెలంగాణ రాజకీయాల్లోకి కల్వకుంట్ల మూడో తరం.. సామాజిక కార్యక్రమాలతో మొదలు..

ఈ నెల 29, 30 తేదీల్లో జరగనున్న గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలంటూ గ్రూప్ 2 విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ముఖ్యమం కేసీఆర్ కీలక నిర్ణయ‍ం తీసుకున్నారు.

ఈ నెల 23 వరకు వేరే పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో గ్రూప్ 2 కు ప్రిపేర్ అవడానికి సమయం ఇవ్వాలంటూ అభ్యర్థులు కోరుతున్నారు. ఈ మేరకు అభ్యర్థులు టీపీసీసీ ముందు ధర్నాలు, రాస్తారోకోలి నిర్వహించగా పలువురు విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు.

మరో వైపు గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలంటూ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అద్ష్యక్షూదు ప్రవీణ్ కుమార్ నిరాహార దీక్షకు కూడా పూనుకున్నారు. మిగతా ప్రతిపక్షాలు కూడా అభ్యర్థులకు మద్దతుగా రంగంలోకి దిగారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం గ్రూప్ 2 అభ్యర్థుల్లో ఆనందాన్ని నింపింది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఆదేశాలు జారీ కావాల్సి ఉంది. అయితే ఆ పరీక్షలు తిరిగి ఎప్పుడు పెడతారనే విషయం అధికారులు నిర్ణయించాల్సి ఉంది.