నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ పై బీఆరెస్ నేత , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. అరవింద్ నోటికి అడ్డూ ఆపూ లేకుండా మాట్లాడుతున్నార
నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ పై బీఆరెస్ నేత , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. అరవింద్ నోటికి అడ్డూ ఆపూ లేకుండా మాట్లాడుతున్నారని, ఆయన పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోవాలనిఆమె హితవు పలికారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ… అరవింద్ నోటికి అదుపులేకుండా పోతోందని, దారుణంగా మాట్లాడుతున్నారన్నారు. టిక్కెట్ ఇస్తానని సొంత పార్టీల నేతల దగ్గర డబ్బులు వసూలు చేస్తారని కవిత ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో తాను నిజామాబాద్ నుంచి పోటీ చేస్తానని, తనది నిజామాబాద్ అని తన కట్టె కాలేవరకు నిజామాబాద్ లోనే ఉంటానన్నారు కవిత. ఈ సారి అరవింద్ కోరుట్ల కు వెళ్ళిపోటీ చేయాలని ప్లాన్లు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన ఎక్కడికి వెళ్తే తాను అక్కడికి వెళ్ళి ఆయనను ఓడిస్తానని కవిత స్పష్టం చేశారు.
కవిత బండి సంజయ్ పై కూడా విమ్నర్శలు కురిపించారు. పార్లమెంటులో తెలంగాణకు ఉపయోగపడె ఒక్క విషయం కూడా ఎన్నడూ మాట్లాడలేదని, కానీ తెలంగాణలో కరెంట్ గురించి అవాకులు చవాకులు మాట్లాడారని కవిత ఆరోపించారు. ఆయన మాట్లాడిన విషయాలపై ఆయనకు నమ్మకముంటే కరీంనగర్ లో కరెంట్ తీగలను పట్టుకోవాలని కవిత సవాల్ విసిరారు.