HomeTelangana

గద్దర్ గురించి చంద్రబాబు అంత కలత చెందాడన్న మాటలు నమ్మొచ్చా ?

గద్దర్ గురించి చంద్రబాబు అంత కలత చెందాడన్న మాటలు నమ్మొచ్చా ?

ప్రజాగాయకుడు గద్దర్ మరణించడం తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్ర ధుంఖ సముద్రంలో ముంచేసింది. త‌న పాటతో పీడుతుల గొంతై గర్జించిన ఆ గొంతు మూగబోయిందని తెలిసి ప

నెయ్యి కల్తీ ప్రచారం: చంద్రబాబుపై సుప్రీం కోర్టు ఆగ్రహం
రాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపి కలిసి పోటీ చేస్తాయి… ప్రకటించిన‌ పవన్
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అడిగినా మూవీ చేయను , నేను జగన్ అభిమానిని… ఆర్జీవీ

ప్రజాగాయకుడు గద్దర్ మరణించడం తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్ర ధుంఖ సముద్రంలో ముంచేసింది. త‌న పాటతో పీడుతుల గొంతై గర్జించిన ఆ గొంతు మూగబోయిందని తెలిసి ప్రజలు తీవర్ విషాదంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో గద్దర్ ను తమ వాడిగా చెప్పుకోవడానికి, గద్దర్ కు తామెంతో మేలు చేశామని చెప్పుకోవడానికి ఎవరెవరో ముందుకొస్తున్నారు. గద్దం అంత్యక్రియలప్పుడు కూడా గద్దర్ ఏ పేదల కోసం పాటపాడారో వారికి చివరి చూపులు కూడా దక్కకుండా రాజకీయ్ అనాయకుల హడావుడి ఎక్కువగా కనిపించింది.

ఇక గద్దర్ పై చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1997 ఏప్రిల్ 6న కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఆ కాల్పులు చంద్రబాబు పోలీసులే జరిపారని అనేక సార్లు గద్దరే ఆరోపించారు కూడా. అయితే గద్దర్ పై కాల్పులు జరిగి ఆయన ఆస్పత్రిలో మరణంతో పోరాడుతున్నప్పుడు చంద్రబాబు గద్దర్ ను బతికించడానికి అన్ని ప్ర‌యత్నాలు చేశారని, గద్దర్ పై దాడి జరగడం పట్ల కలత చెందాడనే కొత్త ముచ్చట మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ చెప్తున్నారు.

”ఏప్రిల్ 6 సాయంత్రం గద్దర్ పై హత్యాయత్నం జరిగింది… ఆ మరుసటి రోజు తెల్లవారుజామున 5.45 గంటలకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాకు ఫోన్ చేశారు . గద్దర్ పై దాడి జరగడం బాధాకరమని, ఆయనను ఎలాగైనా బతికించుకోవాలని నాతో చంద్రబాబు చెప్పారు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి కూడా డాక్టర్లను పిలిపించండని ఆదేశించారు. అప్పట్లో నేను ముఖ్యమంత్రికి డిప్యూటీ సెక్రటరీగా వైద్య, ఆరోగ్య శాఖ వ్యవహారాలను చూస్తున్నాను.

చంద్రబాబు ఆదేశాలతో వైద్యా, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్జునరావుతో కలిసి నిమ్స్ ఆసుపత్రి కాకర్ల సుబ్బారావుతో మాట్లాడాము. ఆ తర్వాత గద్దర్ కు ప్రత్యేకమైన చికిత్సను అందించాము… మూడు రోజుల తర్వాత ఆయన కళ్లు తెరిచారు. అప్పటి వరకు చంద్రబాబు ఎంతో కలత చెందడాన్ని నేను కళ్లారా చూశాను.” అని మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు.

ఈ మాటలను అవుననడానికి కానీ, కాదనడానికి కానీ ఇప్పుడు రుజువులు ఎక్కడ దొరుకుతాయి ?