సియాసత్ పత్రిక ఎండీ, మేనేజింగ్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్టు జహీరుద్దీన్ అలీఖాన్ కొద్ది సేపటి క్రితం మరణించారు. ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర అంత్యక్రియల్ల
సియాసత్ పత్రిక ఎండీ, మేనేజింగ్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్టు జహీరుద్దీన్ అలీఖాన్ కొద్ది సేపటి క్రితం మరణించారు. ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర అంత్యక్రియల్లో పాల్గొన్న జహీరుద్దిన్ అక్కడ జరిగిన తొక్కిసలాటలో కిందపడిపోయినట్టు తెలిసింది. ఆ సమయంలోనే ఆయనకు గుండెపోటు రాగా ఆయనను అల్వాల్ లోని స్థాన్బిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన కన్ను మూశారు. జహీరుద్దీన్ వయసు 62 సంవత్సరాలు
జహీరుద్దీన్ అనేక ఏళ్ళుగా పాత బస్తీలో ఎంఐఎమ్ కు, బీజేపీ కివ్యతిరేకంగా తీవ్ర పోరాటం చేస్తున్నారు. వాలంటరీ ఆర్గనైజేషన్లు ఏర్పాటు చేసి పేద ముస్లింలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. ముస్లింలలో పేదరికం పోవాలని చివరి వరకూ కృషి చేసిన వ్యక్తి జహీరుద్దీన్.
జహీరుద్దీన్ గద్దర్ కు అత్యంత సన్నిహితుడు. తరచుగా గద్దర్ ఆయన ఇంటికి వెళ్ళేవారు. జహీరుద్దీన్ అలీఖాన్ తెలంగాణ ఉద్యమంలో ముస్లింలను పాల్గొనేట్టు చేయడంలో చాలా కృషి చేశారు. ఉద్యమం సందర్భంగా జరిగిన ప్రతి ఒక్క కార్యక్రమంలో జహీరుద్దీన్ తప్పనిసరిగా ఉండే వారు.
తెలంగాణ జర్నలిస్టుల ఫోరం వేయి మంది జర్నలిస్టులతో ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించగా ఆ కార్యక్రమంలో పాల్గొనడమే కాక ఢిల్లీలో తనకున్న పరిచయాలతో పలువురు జర్నలిస్టులకు బస కూడా ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో, అనంఅత్రం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోనూ జరిగిన ప్రతి ప్రజాస్వామిక ఉద్యమంలో జహీరుద్దీన్ పాల్గొన్నారు. ఆయన జర్నలిస్టుగా, సంపాదకులుగానే కాక ఉద్యమకారుడిగా కూడా ప్రజలకు సేవలందించారు. ఆయన మరణం ఒక్క ముస్లింలకే కాదు యావత్తు తెలంగాణ ప్రజలకు, ప్రజాస్వామిక ఉద్యమాలకు తీరని లోటు.