మూడు రోజులుగా నలుగుతున్న సమస్య తీరిపోయింది. తెలంగాణ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకరావాలనుకున్న బిల్లుకు గవర్నర
మూడు రోజులుగా నలుగుతున్న సమస్య తీరిపోయింది. తెలంగాణ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకరావాలనుకున్న బిల్లుకు గవర్నర్ తముళి సై పెండింగ్ లో పెట్టడం వివాదాస్పదమయ్యింది. గవర్నర్ కు వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికులు నిరసన ప్రదర్శనలకు కూడా దిగారు.
ఈ నేపథ్యంలో గవర్నర్ ఆ బిల్లుకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఈ రోజు ఆర్టీసీ విలీన బిల్లును ప్రభుత్వం శాసన సభలో ప్రవేశపెట్టింది. మంత్రి కేటీఆఱ్ ఆ బిల్లుని ప్రవేశ పెట్టగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బిల్లుపై మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్సీ (PRC) ఆర్టీసీ ఉద్యోగులకూ వర్తిస్తుందన్నారు. ఆర్టీసీ కార్పొరేషన్, దాని ఆస్తులు యథాతథంగా ఉంటాయన్నారు. ఉద్యోగులతో చర్చించి.. పదవీ విరమణ బెన్ఫిట్స్ నిర్ణయిస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. ఆర్టీసీ కార్మికుల బకాయిలను కూడా చెల్లిస్తామని చర్చలో భాగంగా పువ్వాడ తెలిపారు.
ఈ బిల్లుపై చర్చ అనంతరం సభ ఏకగ్రీవంగా ఈ బిల్లును ఆమోదించింది.