HomeTelanganaPolitics

అసెంబ్లీలో రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు…స్వంత పార్టీపైనే విమర్శలు

అసెంబ్లీలో రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు…స్వంత పార్టీపైనే విమర్శలు

బీజేపీ ఎమ్మెల్యే టి రాజా సింగ్ ఆదివారం అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు, వచ్చే అసెంబ్లీకి తాను హాజరు కాలేనని ఖచ్చితంగా చెప్పారు. జీరో అవర్‌లో ఆయన

‘జగ్గారెడ్డిని బీఆరెస్ లోకి తీసుకొస్తా’
కాంగ్రెస్ లో టికెట్ల కలవరం…
ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం బిల్లు ఆమోదించిన అసెంబ్లీ

బీజేపీ ఎమ్మెల్యే టి రాజా సింగ్ ఆదివారం అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు, వచ్చే అసెంబ్లీకి తాను హాజరు కాలేనని ఖచ్చితంగా చెప్పారు.

జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ, తనను ఓడించడానికి బైటి పార్టీల వాళ్ళే కాక స్వంత పార్టీ వాళ్ళే ప్రయత్నిస్తున్నారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమి ఖాయమని రాజాసింగ్ అన్నారు. నేను ఓడిపోయినా ఎవరు గెల్చినా దయచేసి గోషామహల్ నియోజకవర్గం కోసం కృషి చేయాలని ఆయన కోరారు.

”రాబోయే ఎన్నికల తర్వాత ప్రస్తుత అసెంబ్లీలో ఉన్నవారంతా సభకు హాజరు కాగలరో లేదో తెలియదు. నేను మాత్రం హాజరు కాలేను. నన్ను ఓడించడానికి ‘బహర్ వాలే భీ ఔర్ ఘర్ వాలే భీ…” బైటివాళ్ళు నా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. నేను అసెంబ్లీకి రావడం నావాళ్ళకే ఇష్టం లేదు.” అని రాజాసింగ్ భావీద్వేగంగా మాట్లాడారు.

”నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా ధూల్‌పేటకు ప్రభుత్వ‌ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ధూల్‌పేట ప్రజలు అభివృద్ధి, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ధూల్‌పేట లోధి సమాజ్ ప్రజల అభివృద్ధి ప్రణాళిక కోసం కృషి చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాను.” అని రాజాసింగ్ అన్నారు.

కాగా రాజాసింగ్ గత ఎన్నికల్లో బీజేపీ తరపున గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆయన మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణం బీజేపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.