HomeTelangana

తెలంగాణ గవర్నర్ కు వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికుల నిరసన – ఆగిన‌ బస్సులు

తెలంగాణ గవర్నర్ కు వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికుల నిరసన – ఆగిన‌ బస్సులు

టిఎస్‌ఆర్‌టిసి విలీన బిల్లుకు ఆమోదం తెలపడంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేస్తున్న‌ జాప్యాన్ని నిరసిస్తూ తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు శనివారం తెల్లవారుజా

‘జగ్గారెడ్డిని బీఆరెస్ లోకి తీసుకొస్తా’
కాంగ్రెస్ లో టిక్కెట్ల చిచ్చు: రేవ‍ంత్, ఉత్తమ్ వాగ్వివాదం… కోపంతో వెళ్ళిపోయిన ఉత్తమ్
BJP Khammam Meeting: BRSతో బైటికి కుస్తీ లోపల దోస్తీ

టిఎస్‌ఆర్‌టిసి విలీన బిల్లుకు ఆమోదం తెలపడంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేస్తున్న‌ జాప్యాన్ని నిరసిస్తూ తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు.

రాష్ట్ర ప్రభుత్వం గతంలో గవర్నర్ ఆమోదం కోసం పంపిన బిల్లుపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి ఆర్టీసీ ఉద్యోగులు బస్ డిపోల వద్దకు చేరుకుని నినాదాలు చేశారు.

ఆర్టీసీ కార్మిక సంఘాలు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు రెండు గంటల పాటు నిరసన తెలిపినా, కొన్ని డిపోల వద్ద ఉదయం 8 గంటలకు మించి నిరసన కొనసాగింది. ముషీరాబాద్‌తోపాటు పలు డిపోల్లోని బస్సులు డిపోల వద్దే నిలిచిపోయాయి.

ఉదయం 10 గంటలకు పివిఎన్‌ఆర్‌ మార్గ్‌కు తరలివచ్చి 11 గంటలకు రాజ్‌భవన్‌ వద్ద ధర్నాకు దిగాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఉద్యోగులందరికీ పిలుపునిచ్చాయి.

మరో వైపు ఉదయం నుంచి హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందుకు ఎదుర్కొన్నారు. కార్యాలయాలకు , వ్యాపారాలకు వెళ్ళేవాళ్ళు బస్సులు లేక ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చింది.