2019లో కర్నాటకలో జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో "మోది ఇంటిపేరు" వ్యాఖ్యలపై క్రిమినల్ పరువునష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి విధించిన శిక్షపై స
2019లో కర్నాటకలో జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో “మోది ఇంటిపేరు” వ్యాఖ్యలపై క్రిమినల్ పరువునష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి విధించిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించిన నేపథ్యంలో, తన కర్తవ్య దీక్షను కొనసాగిస్తానని రాహుల్ గాంధీ అన్నారు
“ఏది ఏమైనప్పటికీ, ‘ఇండియా’ ఆలోచన విధానాన్ని రక్షించడానికి నా కర్తవ్యంకొనసాగిస్తాను.” అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో కలిసి విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “నా మార్గం స్పష్టంగా ఉంది, నేను ఏమి చేయాలో నాకు స్పష్టత ఉంది, మద్దతు ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు.” అని8 అన్నారు.
“రాహుల్ నిజం కోసం పోరాడాడు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 4,000 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. అన్ని వర్గాల ప్రజలను కలుసుకున్నాడు. వారి ఆశీర్వాదం మాకు ఈ ఉపశమనం కలిగించింది” అని ఖర్గే అన్నారు.
అధికార బీజేపీపై విరుచుకుపడిన ఖర్గే, “రాహుల్ ను అనర్హులుగా ప్రకటించడానికి వారికి 24 గంటల కంటే తక్కువ సమయం పట్టింది. ఇప్పుడు ఆయనను తిరిగి నియమించడానికి ఎంత సమయం పడుతుందో చూద్దాం” అని అన్నారు.
తనకు శిక్ష విధించడానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేసిన అప్పీల్‌ను విచారించిన సుప్రీం కోర్టు రాహుల్ వ్యాఖ్యలు సరిగా లేవని ప్[ఏర్కొంది. “పిటిషనర్ ప్రసంగాలు చేయడంలో మరింత జాగ్రత్తగా ఉండవలసింది” అని సుప్రీంకోర్టు పేర్కొంది.
“అనర్హత పరిణామాలు వ్యక్తి యొక్క హక్కును మాత్రమే కాకుండా ఓటర్ల హక్కులను కూడా ప్రభావితం చేస్తాయి” అని కోర్టు పేర్కొంది.
ఈ కేసులో ట్రయల్ జడ్జి గరిష్టంగా రెండేళ్ల జైలుశిక్ష విధించడాన్ని గమనించిన అత్యున్నత న్యాయస్థానం, శిక్ష ఒక రోజు తక్కువగా ఉంటే అనర్హత వేటు పడేది కాదని స్పష్టం చేసింది.
2019లో కర్నాటకలోని కోలార్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘దొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది? అని అన్నారు.
Come what may, my duty remains the same.
— Rahul Gandhi (@RahulGandhi) August 4, 2023
Protect the idea of India.