గురువారంనాడు పార్లమెంటులో ఢిల్లీ సర్వీసుల బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి మాట్లాడుతుండగా. ఆమె మాటలకు ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయి. ద
గురువారంనాడు పార్లమెంటులో ఢిల్లీ సర్వీసుల బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి మాట్లాడుతుండగా. ఆమె మాటలకు ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయి. దాంతో ఆమె “…ఏక్ మినిట్, ఏక్ మినిట్. శాంత్ రహో, తుమ్హారే ఘర్ ఈడీ నా ఆ జాయే,” (మీరు నోరు మూసుకోండి లేదంటే మీ ఇంటికి ఈడీ వస్తుంది.) అని అన్నారు.
సభలో మీనాక్షి లేఖి చేసిన వ్యాఖ్యలతో ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధికార ప్రతినిధి క్లైడ్ క్రాస్టో మాట్లాడుతూ, ”లోక్‌సభలో లేఖి బెదిరింపు లు , ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందన్న ప్రతిపక్షాల ఆరోపణలను రుజువు చేశాయి.” అని అన్నారు
లోక్‌సభలో లేఖి చేసిన వ్యాఖ్యలు హెచ్చరికలా లేక బెదిరింపులా అని భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ బివి ప్రశ్నించారు.
“ఇది హెచ్చరిక లేదా బెదిరింపా?” అని అతను తన X (గతంలో ట్విట్టర్) హ్యాండిల్‌లో రాశాడు.
తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే పార్లమెంటులో లేఖి చేసిన ఈడి వ్యాఖ్యలను “షాకింగ్” గా అభివర్ణించారు. ప్రతిపక్ష నేతలపై ఈడీని ప్రయోగిస్తామని మంత్రులు ఇప్పుడు బహిరంగంగా బెదిరిస్తున్నారని ఆయన అన్నారు.
“ఈరోజు, దిగ్భ్రాంతికరంగా, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి పార్లమెంటులో ప్రతిపక్షాలను బెదిరించారు. ‘నిశ్శబ్దంగా ఉండండి లేదా ఈడి మీ ఇంటికి రావచ్చు’ అని అన్నారు. పార్లమెంటులో మాట్లాడినందుకు ప్రతిపక్షాలపై EDని ఉపయోగిస్తారని బిజెపి మంత్రులు బహిరంగంగా బెదిరించారు. ఇక నిజాలను దాచలేరు’ అని గోఖలే ట్వీట్‌లో పేర్కొన్నారు.
పార్లమెంట్‌లో ప్రతిపక్ష ఎంపీలను కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి బెదిరించారు. పార్లమెంట్‌లో మాట్లాడినందుకు ప్రతిపక్షంపై ఈడీని ప్రయోగిస్తామని బీజేపీ మంత్రులు బహిరంగంగా బెదిరించడం సిగ్గుచేటు అని అని బీఆరెస్ నేత ఏనుగు భరత్‌రెడ్డి తన ట్విట్టర్ హ్యాండిల్‌పై కామెంట్ చేశారు.
“शांत रहो, तुम्हारे घर ना ED आ जाए…”
— Enugu Bharath Reddy (@BharathReddyTRS) August 3, 2023
“Keep quiet or ED may arrive at your home”
— Union Minister Meenakshi Lekhi threatened the Opposition MP’s in Parliament
BJP Ministers now openly threaten to use ED against Opposition just for speaking in Parliament! 🤷🏻♂️
Shameful !! pic.twitter.com/AKa5LqJHK0