అక్రమంగా క్యాసినో casino నిర్వహించారనే కేసులు, చట్ట వ్యతిరేకంగా పలు జంతువులను పెంచుకుంటున్నాడనే కేసులు, ఫెమా FEMA నిబంధనల ఉల్లంఘన, హవాలా ద్వారా డబ్బు
అక్రమంగా క్యాసినో casino నిర్వహించారనే కేసులు, చట్ట వ్యతిరేకంగా పలు జంతువులను పెంచుకుంటున్నాడనే కేసులు, ఫెమా FEMA నిబంధనల ఉల్లంఘన, హవాలా ద్వారా డబ్బులు చెల్లింపుల వ్యవహారంలో ఈడీ అభియోగాలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ Chikoti Praveen రాజకీయ రంగ ప్రవేశం చేయాలని కొంత కాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
తనపై ఉ7న్న అభియోగాలు, కేసుల నుండి బైటపడాలంటే బీజేపీ BJP యే సరైన మార్గమని భావిస్తున్న ప్రవీణ్ ఆ పార్టీలో చేరడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పార్టీలోని పలువురు నాయకులు కూడా ప్రవీణ్ ను బీజేపీలోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో చీకోటి ప్రవీణ్ ఈ రోజు ఢిల్లీకి వెళ్ళి బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ Bandi sanjay , జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణలను DK Aruna కలిశారు. వీళ్ళిద్దరినే కాకుండా ఈ మధ్యనే బీజేపీలో చేరిన సినీ నటి జయసుధను Jayasudha కూడా చీకోటి కలిశారు.
బండి సంజయ్, డీకే అరుణ, జయసుధలతో చీకోటి ప్రవీణ్ ఏమి చర్చించాడనే విషయాలు పూర్తిగా బైటికి రాకపోయినప్పటికీ తాను బీజేపీలో చేరడానికి సహకరించవలసిందిగా వారిని కోరినట్టు సమాచారం.
ప్రవీణ్ ఢిల్లీలో మరికొందరు బీజేపీ నేతలను కూడా కలవాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తనకు నడ్డా Nadda తో సమావేశం ఏర్పాటు చేయవలసిందిగా తెలంగాణ కు చెందిన బీజేపీ నేతలను ప్రవీణ్ కోరినట్టు తెలుస్తోంది.
మరి ఇన్ని కేసులు ఎదుర్కొంటున్న, వివాదాస్పదుడైన చీకోటి ని బీజేపీ చేర్చుకుంటుందా ? చేర్చుకొని ఆయనను కేసుల నుండి విముక్తం చేస్తుందా? అందుకోస౦ ఆయన బీజేపీకి చేయగల సహాయం ఏంటి ? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.