HomeNationalCrime

‘నేను శివభక్తుడిని, అయినా బజరంగ్ దళ్ వాళ్ళు నా షాప్ కాల్చేశారు’

‘నేను శివభక్తుడిని, అయినా బజరంగ్ దళ్ వాళ్ళు నా షాప్ కాల్చేశారు’

సోమవారం నాటి శోభా యాత్ర సందర్భంగా హర్యానాలోని వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకున్న హింసాకాండలో కొందరు హిందువుల‌ దుకాణాలు మత మూకలు ధ్వంసం చేశాయి. తమ ఆస్తుల

జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా చంపై సోరెన్‌
రాహుల్ పై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం, జైరాం రమేష్, అస్సాం యూనిట్ పీసీసీ చీఫ్ పై దాడి
మళ్లీ సెంటిమెంట్ పాలిటిక్స్‌కు తెరలేపుతున్న కేసీఆర్.. తెరపైకి సమైక్యవాదం

సోమవారం నాటి శోభా యాత్ర సందర్భంగా హర్యానాలోని వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకున్న హింసాకాండలో కొందరు హిందువుల‌ దుకాణాలు మత మూకలు ధ్వంసం చేశాయి. తమ ఆస్తులను హిందూత్వ వర్గాలే ధ్వంస చేశాయని షాపుల యజమానులు పేర్కొన్నారు.

సోహ్నాలో, ఒక ఆటోమొబైల్ దుకాణం దెబ్బతింది. బజరంగ్ దళ్ మూక ఆ షాపుపై దాడి చేస్తున్నప్పుడు దాని యజమాని శత్రుఘ్న శుక్లా తన ఇంటిలో దాక్కున్నాడు. తన బుల్లెట్ బైక్ కు, స్కూటీకి, కారుకు, షాపుకు నిప్పంటించడాన్ని అతను చూశాడు.

“గది నుండి ప్రతిదీ నేను చూశాను. శొభా యాత్రలో ఉన్న బజరంగ్ దళ్ వ్యక్తులు వచ్చి నా బైక్‌కు నిప్పు పెట్టారు. ఒక స్కూటీని, ఒక కారును కూడా ధ్వంసం చేశారు. నేను ప్రతిదీ చూస్తున్నాను, కానీ నేను బయటకు రాలేకపోయాను ఎందుకంటే వంద మంది గుంపు ముందు ఒక వ్యక్తి ఏమి చేయగలడు? నేను నిస్సహాయంగా ఉన్నాను,” అని శుక్లా ఓ ప్రముఖ వెబ్ పోర్టల్ ప్రతినిధితో చెప్పాడు .
వారు తన దుకాణాన్ని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారని అడిగినప్పుడు, శుక్లా “ఎందుకంటే ఇది ముస్లింల దుకాణం అని వారు భావించి ఉంటారు” అని అన్నారు.

“ఈ మొత్తం లేన్‌లో ముస్లింల ఇళ్లు, ముస్లింల దుకాణాలు మాత్రమే ఉన్నాయి. వాటిలో చాలా ధ్వంసమయ్యాయి కూడా. హిందువులు నిర్వహించే ఏకైక దుకాణం నాది. కనుక ఇది కూడా ముస్లింల దుకాణమేనని వారు భావించి ఉండాలి. నేను హిందువునని వారికి చెప్పాలనుకున్నాను, కానీ నేను చాలా భయపడ్డాను. వాళ్లు నన్ను నమ్మేవారో లేదో ఎవరికి తెలుసు.” అని శుక్లా అన్నారు.
పక్కనే ఉన్న లేన్‌లోని ముస్లింలకు చెందిన ఇతర దుకాణాలు కూడా దెబ్బతిన్నాయి.

ఆ షాపు పేరు ‘శివ ఆటోమొబైల్’.

“నేను శివభక్తుడిని, అయినా వారు నన్ను విడిచిపెట్టలేదు. నేను ఏమి చెప్పగలను, అది వారి మనస్తత్వం, ”అన్నారాయన. ఆ ప్రదేశంలో దశాబ్ద కాలంగా తన దుకాణాన్ని నడుపుతున్నట్లు శుక్లా తెలిపారు. “కానీ నేను ఏ ముస్లిం నుండి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. మేమిద్దరం అన్నదమ్ముల్లా ఉన్నాం” అని అన్నారు.

హిందూ యాజమాన్యంలోని దాబా ధ్వంసమైంది
సోహ్నాలోని ‘శంకర్ శంభు హోటల్ అండ్ రెస్టారెంట్’ అని పిలువబడే ధాబాపై కూడా బజరంగ్ దళ్ మూక దాడి చేసింది. వంటగది ని ధ్వంసం చేశారు. ఫ్రిజ్ ధ్వంసమైంది. జనం లోపలికి రావడం చూసి తాను, తన సోదరులు మేడమీద దాక్కున్నామ‌ని యజమాని లోకేష్‌ తెలిపారు.

“వారు లోపలికి ప్రవేశించారు, మా కిటికీలు, మా ఫ్రిజ్‌లు పగలగొట్టారు, మా సిలిండర్‌ను దొంగిలించారు, ధాబాలోని ఒక భాగంలో నిప్పంటించారు … మేము మేడమీద నుండి ప్రతిదీ చూస్తున్నాము” అని లోకేష్ చెప్పారు.
దాబాలో ఉన్న ఒక కార్మికుడు, కర్రలతో శొభా యాత్రకు వచ్చిన వ్యక్తులు దాబాను ధ్వంసం చేశారని చెప్పాడు.

వారు అలా ఎందుకు చేశారని భావిస్తున్నారని అడిగిన ప్రశ్నకు, “మా ధాబాను ఇలా ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారో నాకు తెలియదు. ఇది 40 ఏళ్ల నాటి దాబా, మా కుటుంబం చాలా కాలంగా దీన్ని నడిపిస్తోంది.” అని లోకేష్ చెప్పారు.

VHP, బజరంగ్ దళ్ నేతృత్వంలోని శోభా యాత్ర లేదా ‘బ్రిజ్ మండల్ జలాభిషేక్ యాత్ర’ సందర్భంగా హింస ప్రారంభమైన మూడు రోజుల తర్వాత కూడా, హర్యానాలోని వివిధ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు కొనసాగాయి. సోమవారం నాటి ఘర్షణల్లో ఆరుగురు మృతి చెందారు. పోలీసులు 116 మందిని అరెస్టు చేశారు, 90 మందిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం మరో నాలుగు కంపెనీల కేంద్ర బలగాలను కోరినట్లు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు.