HomeTelangana

టీఎస్ఆర్టీసీ విలీనంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు

టీఎస్ఆర్టీసీ విలీనంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు

హైదరాబాద్‌లోనే ప్రైమ్ లొకాలిటీలో వందల కోట్ల రూపాయల విలువైన భూములు, భవనాలు ఆర్టీసీకి ఉన్నాయి.

తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తు ఖరారైనట్టేనా ?
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కేటీఆర్, కవితలపై గవర్న‌ర్ కు లేఖరాసిన సుఖేశ్ చంద్రశేఖర్… వాడో క్రిమినల్, ఫ్రాడ్ అని కేటీఆర్ మండిపాటు

2019లో టీఎస్ఆర్టీసీ కార్మకులు సుదర్ఘ సమ్మె చేశారు. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల జీతాలు పెంచాలని.. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తో ఈ సమ్మె జరిగింది. అప్పుడు సీఎం కేసీఆర్ వారిపై ఉక్కుపాదం మోపారు. సమ్మె చేసిన వారందరినీ ఉద్యోగాల నుంచి తీసేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆ తర్వాత మొత్తబడిన కేసీఆర్ వారికి వేతనాలు పెంచి.. తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. అప్పటి నుంచి కార్మికులు సమ్మె చేయాలంటే భయపడుతున్నారు.

ఆనాడు అడిగితే తిట్టి, ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్.. ఈ రోజు ఎవరూ అడగకుండానే టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో బిల్ పాస్ అయి.. సంస్థ ప్రభుత్వంలోకలవడం ఇక లాంఛన ప్రాయమే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందునే కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. ఆర్టీసీలో పనిచేస్తున్న దాదాపు 43వేల మంది ఉద్యోగుల, కార్మికుల కుటుంబాలను ఒక్క నిర్ణయంతో కేసీఆర్ తనవైపు తిప్పుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ నిర్ణయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత భారీ మొత్తంలో భూములను సీఎం కేసీఆర్, ఆయన కుటుంబీకులు, బీఆర్ఎస్ నేతలు కబ్జాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ధరణి పోర్టల్ కారణంగా ఎంతో మంది పేదలు, దళితుల భూములు కోల్పోయారనే విమర్శులు ఉన్నాయి. ఇప్పుడు టీఎస్ఆర్టీసీ విలీనవ వల్ల ఎంతో విలువైన భూములు, ఆస్తులు ప్రభుత్వ పరం కాబోతున్నాయి. తర్వాత వీటిని అమ్మేసుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ జరుగుతోంది.

టీఎస్ఆర్టీసీకి 11 రీజియన్లు, 3 జోన్లలో 92 డిపోలు ఉన్నాయి. అలాగే 2 జోనల్ వర్క్ షాప్‌లు, ఒక బస్ బాడీ బిల్డింగ్ యూనిట్, రెండు టైర్ రీట్రేడింగ్ షాపులు, ఒక ప్రింటింగ్ ప్రెస్, ఒక ట్రాన్స్‌పోర్ట్ అకాడమీ, రెండు స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలు, రెండు డిస్పెన్సరీలు, దవాఖానలుఉన్నాయి. అంతే కాకుండా దాదాపు 9,500 బస్సులు, పదుల సంఖ్యలో బస్టాండ్లు, వందల సంఖ్యలు బస్ షెల్టర్లు ఉన్నాయి. స్థిర, చర ఆస్తులు కలిపి దాదాపు రూ.50 వేల కోట్ల విలువ కలిగి ఉంటుంది. అయితే టీఎస్ఆర్టీకి ప్రస్తుతం ఉన్న అప్పు రూ.4వేల కోట్ల లోపే ఉంటుంది. కాగా, రూ.50వేల కోట్ల ఆస్తులపై కన్నేయడం వల్లే టీఎస్ఆర్టీసీని అకస్మాతుగా ప్రభుత్వంలో విలీనం చేసే నిర్ణయం తీసుకున్నట్లు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

హైదరాబాద్‌లోనే ప్రైమ్ లొకాలిటీలో వందల కోట్ల రూపాయల విలువైన భూములు, భవనాలు ఆర్టీసీకి ఉన్నాయి. వీటిని అమ్మకానికి పెట్టాలంటే అవి ప్రభుత్వానికి చెంది ఉండాలి. అందుకే కార్పొరేషన్‌ను ప్రభుత్వంలో విలీనం చేశారని కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. కాగా, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు మాత్రం తమను ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.