HomeNationalCrime

‘తోటి విద్యార్థులను కులము, మార్కులు అడగొద్దు’

‘తోటి విద్యార్థులను కులము, మార్కులు అడగొద్దు’

సహ విద్యార్థులను వారి కులము, వారికి వచ్చిన ర్యాంక్ వివరాలు అడగొద్దని ఐఐటీ-బాంబే మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎవరైనా తోటి విద్యార్థులను ఆ వివరాలు అడ

గ్రూప్ 2 పరీక్షలు వాయిదా… కేసీఆర్ ఆదేశాలు
హిమాన్షు అన్నా ప్లీజ్ మా స్కూల్ నూ దత్తత తీసుకోవా !
కష్ట‌పడ్డా, సిన్మాలుదీసిన…. మంత్రి మల్లారెడ్డిని అనుకరించిన హీరో నవీన్ పోలిశెట్టి

సహ విద్యార్థులను వారి కులము, వారికి వచ్చిన ర్యాంక్ వివరాలు అడగొద్దని ఐఐటీ-బాంబే మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎవరైనా తోటి విద్యార్థులను ఆ వివరాలు అడిగారని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐఐటీ-బాంబే పాలకవర్గం ప్రకటించింది.

కుల వివక్ష కారణంగా అక్కడ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న దర్శన్ సోలంకి ఫిబ్రవరి 12న తన హాస్టల్‌ ఏడో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఐఐటీ బాంబే క్యాంపస్‌లో కుల వివక్ష ఎదుర్కొన్నానంటూ అతడు అంతకుమునుపు తన తల్లికి ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. తన కులం గురించి తెలియగానే వారి ప్రవర్తనలో మార్పు వచ్చిందని అన్నాడని పోలీసులు తమ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల మధ్య కులం ఆధారిత వివక్షను అంతమొందించే లక్ష్యంతో ఈ మార్గదర్శకాలను విడుదల చేశామని ఐఐటీ-బాంబే తెలిపింది. ఈ మేరకు క్యాంపస్ మొత్తం పోస్టర్లు వేశారు. అలాగే విద్యార్థులకీ ఈ ఆదేశాలను మెయిల్ చేశారు.

తోటి విద్యార్థిని వారి పుట్టుక/అడ్మిషన్ కేటగిరీ గురించి అడగడం సరికాదని ఇన్‌స్టిట్యూట్ భావిస్తుందని మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి, ఎందుకంటే ఇది కుల‌ పక్షపాతానికి దారితీయవచ్చు. “విద్యార్థులు ఇతర విద్యార్థుల కులం , వారి
JEE ర్యాంకులు/గేట్ స్కోర్‌ల గురించి అడగడం సరికాదు. ఎందుకంటే వారికొచ్చే ర్యాంకుల ఆధారంగా కులం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు” అని పాలకవర్గం పేర్కొంది.

డిపార్ట్‌మెంట్, క్రీడలు, సంగీతం, చలనచిత్రాలు, పాఠశాల, కళాశాల, గ్రామం, పట్టణం లేదా అభిరుచులు వంటి సాధారణ అంశాల గురించి అడిగి తెలుసుకోవచ్చని , కులపరమైన సందేశాలు లేదా జోకులు, మతం, లైంగిక ధోరణి ఆధారంగా మూర్ఖత్వాన్ని ప్రదర్శించే వాటిని వేధింపులు, బెదిరింపుగా భావించే వాటిని షేర్ చేసుకోకుండా, ఫార్వార్డ్ చేయకుండా మార్గదర్శకాలు నిషేధించాయి. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇ-మెయిల్ వంటి ఆన్‌లైన్ ఫోరమ్‌లలో విద్యార్థులు అలాంటి సందేశాలను పోస్ట్ చేయకుండా నిషేధించింది.
నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినంగా శిక్షించబడతార‌ని అడ్మినిస్ట్రేషన్ విద్యార్థులను హెచ్చరించింది. ఇతరుల భావాల పట్ల మర్యాద, సున్నితత్వం అందరి నుండి ఆశిస్తున్నామని, ఈ సంస్థ రాజ్యాంగంలోని రిజర్వేషన్ విధానాన్ని అత్యంత స్ఫూర్తితో అమలు చేస్తుందని, ప్రవేశం పొందిన విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తుందని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
క్యాంపస్‌లో కుల వివక్షను అరికట్టడానికి ఇన్స్టిట్యూట్ తీసుకున్న ఈ చొరవ మార్పును కలిగిస్తుందని ఆశిస్తున్నట్లు ఒక విద్యార్థి చెప్పారు. అంబేద్కర్ పెరియార్-ఫూలే స్టడీ సర్కిల్‌కు అనుబంధంగా ఉన్న మరో విద్యార్థి మాట్లాడుతూ గత సంవత్సరం కూడా కొన్ని మార్గదర్శకాలతో ఒక కరపత్రం పంపిణీ చేశారని, అయితే అవి అంత స్పష్టంగా లేవని అన్నారు.
గత సంవత్సరం కరపత్రం సాధారణంగా కుల వివక్ష గురించి మాట్లాడింది. రిజర్వేషన్ పొందిన విద్యార్థులను ఎగతాళి చేయడం, అవహేళన చేయడం, వారి JEE ర్యాంక్ల పై విద్యార్థులను ఎగతాళి చేయడం, వారిని అనర్హులని, మెరిట్ లేని వారని ఎగతాళి చేయడం, కుల పేరుతో దూషించడం వంటివి ఉన్నాయి.