HomeNationalCrime

రైల్లో కానిస్టేబుల్ కాల్పులు – ASI సహా నలుగురు మృతి

రైల్లో కానిస్టేబుల్ కాల్పులు – ASI సహా నలుగురు మృతి

మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) కానిస్టేబుల్ సోమవారం నడుస్తున్న రైలులో నలుగురు వ్యక్తులను కాల్చిచ

నటి రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో ప్రధాన నిందితుడి అరెస్ట్
ఆ ముఖ్యమంత్రి జైలు నుండే పరిపాలిస్తారట‌
దళితుడు ఇంట్లోకి వస్తే ఆవు మూత్రంతో ఇంటిని శుభ్రం చేసుకునే వ్యక్తి కేసీఆర్ -మోత్కుపల్లి సంచలన కామెంట్స్

మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) కానిస్టేబుల్ సోమవారం నడుస్తున్న రైలులో నలుగురు వ్యక్తులను కాల్చిచంపాడు.
జైపూర్-ముంబై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ లో ఉదయం 5 గంటలకు కానిస్టేబుల్ తన ఆటోమేటిక్ వెపన్ తో కాల్పులు జరపగా RPF అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ , మరో ముగ్గురు ప్రయాణికులు మరణించారని అధికారులు తెలిపారు.

చేతన్ కుమార్ చౌదరి అనే ఈ కానిస్టేబుల్ తన ఎస్కార్ట్ డ్యూటీ ఇంచార్జి ASI టికా రామ్ మీనాపై నడుస్తున్న రైలులో కాల్పులు జరిపాడని అధికారి తెలిపారు.

తన సీనియర్‌ని చంపిన తర్వాత, కానిస్టేబుల్ మరో బోగీకి వెళ్లి ముగ్గురు ప్రయాణికులను కాల్చి చంపాడని అధికారి తెలిపారు.
ప్రయాణీకులు రైల్వే పోలీసులకు సమాచారం అందించగా వారొచ్చే లోపే చేతన్ కుమార్ చౌదరి తన తుపాకీతో సహా తప్పించుకొని పారిపోయాడు. అయితే ఆర్‌పిఎఫ్ అధికారుల సహాయంతో మీరా రోడ్ వద్ద కానిస్టేబుల్‌ను పోలీసులు పట్టుకున్నారు.

అయితే కానిస్టేబుల్ చేతన్ కుమార్ చౌదరి కాల్పులు ఎందుకు జరిపాడు అనే విషయం తేలాల్సి ఉన్నది.