ఉత్తరప్రదేశ్ Uttarpradesh లోని డియోరియా Deoriaలో ఇద్దరు ప్రాంతీయ రక్షక్ దళ్ Prantiya Rakshak Dal (PRD) జవాన్లు నీళ్ళు అడిగిన పాపానికి వికలాంగుడిని ద
ఉత్తరప్రదేశ్ Uttarpradesh లోని డియోరియా Deoriaలో ఇద్దరు ప్రాంతీయ రక్షక్ దళ్ Prantiya Rakshak Dal (PRD) జవాన్లు నీళ్ళు అడిగిన పాపానికి వికలాంగుడిని దుర్భాషలాడారు, కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో social media వైరల్ అవుతోంది.
ఈ సంఘటన శనివారం జరిగింది. వీడియోలో, సచిన్ సింగ్ sachin singh తన ట్రైసైకిల్ tricycleపై కూర్చుని ఉండగా, యూనిఫాంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అతన్ని తీవ్రంగా కొట్టడం స్పష్టంగా కనపడుతోంది.
విషయం తెలుసుకున్న చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ Chief Development Officer రవీంద్ర కుమార్ ముగ్గురు అధికారుల నేతృత్వంలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. వికలాండిపై దాడి చేసిన ఇద్దరు పీఆర్‌డీ జవాన్లను రాజేంద్ర మణి, అభిషేక్ సింగ్‌లుగా గుర్తించినట్లు ఎస్పీ సంకల్ప్ శర్మ తెలిపారు.
పీఆర్‌డీ జవాన్లిద్దరినీ విధుల నుంచి తొలగించి, పోలీసు శాఖతో వారికి ఇకపై ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది.
బాధితుడు, 26 ఏళ్ల సచిన్ సింగ్, 2016లో ముంబైలో జరిగిన రైలు ప్రమాదంలో తన రెండు కాళ్లను కోల్పోయాడు. అతను సిమ్ కార్డుల విక్రేతగా, రెస్టారెంట్‌లో డెలివరీ బాయ్‌గా కూడా పనిచేస్తున్నాడు.
సచిన్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి భోజనం చేసి ఇంటికి తిరిగి వస్తుండగా రోడ్డుపై తాబేలు కనిపించింది. దాన్ని ఎత్తుకుని దుగ్ధేశ్వరనాథ్ ఆలయ సమీపంలోని చెరువులో వదిలేశాడు.
“చెరువు నుండి తిరిగి వచ్చిన తర్వాత, నేను విధుల్లో ఉన్న ఇద్దరు PRD జవాన్లను చూశాను. తాబేలును పట్టుకోవడం వల్ల నా చేతులకు వాసన రావడంతో వారిని కొంచెం నీరు అడిగాను” అని సచిన్ చెప్పాడు.
“అయితే, నీళ్ళు అడిగినందుకు వారు నన్ను జైల్లో పెడతామని బెదిరించారు. కొట్టడం ప్రారంభించారు. నా ట్రైసైకిల్ తాళం కూడా లాక్కున్నారు.” అని చెప్పాడు సచిన్
ఈ ఘటన మొత్తాన్ని టెర్రస్‌పై నుంచి ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా ఆ వీడియో వైరల్‌గా మారింది.
In UP's Deoria, a purported video of a specially-abled man on a tricycle being assaulted by two men identified as Prantiya Rakshak Dal (PRD) jawans has surfaced on social media. pic.twitter.com/grJgsp195G
— Piyush Rai (@Benarasiyaa) July 30, 2023