బీహార్‌లోని కటిహార్ జిల్లాలో సరిగ్గా విద్యుత్ సరఫరా జరగడం లేదని ఆరోపిస్తూ వేలాదిమంది ప్రజలు మూడు రోజుల క్రితం కటిహార్ లో నిరసన ప్రదర్శన చేశారు. ఆ సమయ
బీహార్‌లోని కటిహార్ జిల్లాలో సరిగ్గా విద్యుత్ సరఫరా జరగడం లేదని ఆరోపిస్తూ వేలాదిమంది ప్రజలు మూడు రోజుల క్రితం కటిహార్ లో నిరసన ప్రదర్శన చేశారు. ఆ సమయంలో జరిగిన పోలీసు కాల్పుల్లో కుర్షీద్ ఆలమ్, సోనూ షా అనే ఇద్దరు యువకులు మరణించగా, నియాజ్ అలామ్ అనే యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనపై, బీహార్ లో ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఈ కాల్పుల సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అయితే సంఘటన్హ జరిగి మూడు రోజుల తర్వాత పోలీసులు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. కుర్షీద్ ఆలమ్, సోనూ షా లు మరణించింది పోలీసుల కాల్పుల వల్ల కాదని ఓ అగంతకుడి కాల్పుల్లో వారు మరణించారని చెప్పడమే కాక వీడియో రుజువులు మీడియా ముందు పెట్టారు.
నిరసన ప్రదేశంలో ఓ అగంతక వ్యక్తి కాల్పులు జరిపిన వీడియోను పోలీసులు విడుదల చేశారు. ఈ వ్యక్తి పేల్చిన బుల్లెట్లకు బాధితులు తగిలినట్లు పోలీసులు తెలిపారు.
బుధవారం నాటి ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని జిల్లా మేజిస్ట్రేట్ రవిప్రకాష్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జితేంద్ర కుమార్ మీడియాకు షేర్ చేశారు.
“ఇది ప్రణాళికాబద్ధమైన కుట్ర. నిరసనకారులను తరమడానికి పోలీసులు చాలా దూరం నుండి కాల్పులు జరిపారు. అప్పటి నుంచి మాకు అనుమానంగానే ఉంది. ” అని ఎస్పీ కుమార్ మీడియాతో అన్నారు.
CCTV ఫుటేజ్‌లో ఒక వ్యక్తి “మొదటి మరణం సంభవించిన దిశగా వస్తున్నట్లుగా ఉంది. అతను మరో ఇద్దరు ఆగంతకులపై కాల్పులు జరిపి గాయపరచడం చూడవచ్చు, వారిలో ఒకరు తరువాత మరణించారు” అని అధికారులు తెలిపారు.
“ఈ రోజు, మేము విచారణ కోసం సంఘటన స్థలానికి వచ్చాము. మనం ఏది చేసినా అది వాస్తవం ఆధారంగా ఉంటుంది. సీసీ కెమెరాను పరిశీలించాం. మేము మొదట మృతదేహం పడి ఉన్న ప్రదేశానికి వెళ్లాము. పోలీసులు కాల్చిన బుల్లెట్ దూరాన్ని బట్టి మరణించిన వ్యక్తిని తాకడం అసాధ్యమని కనుగొన్నాము. ఓ యువకుడు వచ్చి ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపినట్లు సీసీటీవీలో కనిపిస్తోంది.” అని ఎస్పీ తెలిపారు.
గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అయితే నిందితుల వివరాలను మాత్రం వారు వెల్లడించలేదు.
VIDEO | The Katihar Police has released a CCTV footage related to the firing incident that took place on July 26.
— Press Trust of India (@PTI_News) July 28, 2023
(Source: Third Party) pic.twitter.com/KV7gtxbIDo