HomeTelanganaPolitics

హైదరాబాద్ నగరంలో వరద పరిస్థితిని పరిశీలించిన కేటీఆర్…ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచన‌

హైదరాబాద్ నగరంలో వరద పరిస్థితిని పరిశీలించిన కేటీఆర్…ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచన‌

భారీ వర్షాలతో సతమవుతున్న హైదరాబాద్ నగర పరిస్థితిని ఈ రోజు తెలంగాణ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. నగరంలో పలు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన్ అధికారులక

‘గ్రూప్స్’ కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని ఆత్మ‌హత్య..అర్దరాత్రి హైదరాబాద్ లో విద్యార్థుల ఆందోళన‌
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పంపిణీ పైన మంత్రి కేటీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం
నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం – తొమ్మిది మంది సజీవ దహనం

భారీ వర్షాలతో సతమవుతున్న హైదరాబాద్ నగర పరిస్థితిని ఈ రోజు తెలంగాణ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. నగరంలో పలు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన్ అధికారులకు తగు సూచనలు, ఆదేశాలిచ్చారు.

హుస్సేన్ సాగర్ వద్ద వరద ఉధృతిని, మూసారాంబాగ్ లో మూసీనది వరద పరిస్థితిని పరిశీలించిన మంత్రి కేటీఆర్ ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులకు ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రాథమిక ప్రాధాన్యతగా  పని చేయాలని, శిథిల భవనాల నుంచి జనాలను వెంటనే తరలించాలని అధికారులను కోరారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులపైన అధికారులు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్, రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలను ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు. హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసి కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు… క్షేత్రస్థాయిలో ఉన్న కిందిస్థాయి సిబ్బంది వరకు అందరూ పనిచేస్తున్నారని, పురపాలక ఉద్యోగుల అన్ని సెలవులను రద్దు చేశామని,  పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా ఇతర మాధ్యమాల ద్వారా సమీక్షిస్తున్నామని కేటీఆర్ తెలిపారు.

కుంభవృష్టిగా వర్షం పడడం ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం వలన ప్రజలకు కొంత ఇబ్బంది ఎదురవుతున్నదని, కానీ ఇప్పటిదాకా ఎలాంటి ప్రాణా నష్టం జరగకుండా సాధ్యమైనని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని కేటీఆర్ చెప్పారు.
ప్రాణ నష్టం జరగకుండా చూడడమే తమ‌ ప్రధాన లక్ష్యం అని కేటీఆర్ స్పష్టం చేశారు.

”గతంలో ఇలాంటి భారీ వర్షాలు పడితే అనేక ప్రాంతాలు జలమయం అయ్యేది. అయితే ఈసారి నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా చేపట్టిన కార్యక్రమాల వలన వరద ప్రభావం కొంత తగ్గింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఆయా ప్రాంతాల్లో వరద సమస్య బాగా తగ్గింది. ప్రభుత్వము, ప్రభుత్వ యంత్రాంగం పూర్తి సిబ్బంది 24 గంటలు ఈ భారీ వర్షాలను ఎదుర్కొనేందుకు పనిచేస్తుంది.” అని కేటీఆర్ తెలిపారు.

ప్రతిపక్ష పార్టీలు, భారీ వర్షాల్లో నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యం  దెబ్బతీసే విధంగా చిల్లర విమర్శలు చేయవద్దని, చిల్లర రాజకీయాలు మానుకొని భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. వరంగల్ కూడా నీట మునిగిందని, అక్కడికి వెళ్ళాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించామని, అవసరమైతే తాను శుక్రవారం అక్కడకు వెళ్తానని చెప్పారు.