వివాదాస్పద మూవీ 'ది కాశ్మీర్ ఫైల్స్' తో ప్రసిద్ధి చెందిన చిత్రనిర్మాత, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ప్రభాస్ పై నోరు పారేసుకున్నాడు. కొంతకాలంగా వివేక్
వివాదాస్పద మూవీ ‘ది కాశ్మీర్ ఫైల్స్’ తో ప్రసిద్ధి చెందిన చిత్రనిర్మాత, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ప్రభాస్ పై నోరు పారేసుకున్నాడు. కొంతకాలంగా వివేక్ అగ్నిహోత్రి ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ మూవీపై విమర్శలు గుప్పిస్తున్నాడు.
తాజాగా ఆయన ఆదిపురుష్ మూవీ గురించి మాట్లాడుతూ, రాత్రి ఫుల్ గా తాగేసి, పొద్దున లేచి వచ్చి నేనే దేవుడిని అంటే ఎవరైనా నమ్ముతారా అంటూ పరోక్షంగా ప్రభాస్ పై అక్కసు వెళ్ళగక్కారు. తెరపై దేవుడి పాత్రలో ఏ నటుడినైనా అంగీకరించడానికి ప్రజలు ఇడియట్స్ కాదు అని అన్నాడు.
ఒక ట్రెండ్ నడుస్తున్నందువల్ల అలాంటి సినిమాలే తీస్తారని, అయితే దాన్ని తీసినవాళ్ళు, నటించిన వాళ్ళు పూర్తిగా నమ్మకపోతే, ఆ సినిమాను ప్రేక్షకులు తిప్పి కొడతారు అన్నారు. “మీరు ప్రజల విశ్వాసాలకు సంబంధించిన కథలను ఎంచుకున్నప్పుడు, దానిపై మీకు 100% నమ్మకం ఉండాలి. ఒక చరిత్రకారుడిలా మీరు ఈ అంశంపై బాగా ప్రావీణ్యం కలిగి ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో ఎవరూ అలా లేరు.” అని వ్యాఖ్యానించాడు వివేక్ అగ్నిహోత్రి
ఇటీవల ఓం రౌత్ నిర్మించి దర్శకత్వం వహించిన పౌరాణిక మూవీ ఆదిపురుష్ లో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ రూ. 135.04 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది.
ఆ మూవీ పరాజయం పాలైనప్పటి నుంచి వివేక్ అగ్నిహోత్రి ఆ మూవీపై విరుచుకపడుతున్నాడు. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ పైనే దారుణంగా మాట్లాడటం ప్రభాస్ అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యింది.