HomeTelangana

హైదరాబాద్ ప్రజలకు రెడ్ అలర్ట్

హైదరాబాద్ ప్రజలకు రెడ్ అలర్ట్

హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది.తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చే

తెలంగాణకు గుడ్ న్యూస్… ఇక భారీ వర్షాలు లేనట్టే
‘స్వామీ.. నదికి పోలేదా? .. లేదు, నదే సిటీకి వచ్చింది’
అక్కడ రోడ్లపై కార్లు పారుతున్నాయి

హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది.
తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, నగరం, చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో ఇప్పటికే గణనీయమైన వర్షపాతం నమోదైంది.

ఈ ఉదయం 8 గంటల వరకు మియాపూర్‌లో 65.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాప్రా 63.8 మి.మీ, చెర్లపల్లి వద్ద 62.8 మి.మీ, లంగర్ హౌజ్ 60.5 మి.మీ, హైదర్‌నగర్ 59.5 మి.మీ, చద్రాయణగుట్ట 58.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.

IMD జారీ చేసిన రెడ్ అలర్ట్ ప్రకారం ఈ రోజంతా భారీ వర్షపాతం కొనసాగే అవకాశం ఉంది. హైద్రాబాద్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్య‌వసరమైతే తప్ప ఇంట్లోంచి బైటికి రావద్దని అధికారులు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు, నీరు నిలిచిన వీధులు, అండర్‌పాస్‌ల గుండా వాహనాలు నడపడం మానుకోవాలని అధికారులు ప్రజలను కోరారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిస్థితిని చక్కదిద్దడానికి, ఆపదలో ఉన్న నివాసితులకు సహాయం చేయడానికి అత్యవసర బృందాలను మోహరించింది. అదనంగా, భారీ వర్షాల కారణంగా తలెత్తే ఏవైనా అత్యవసర పరిస్థితులను నిర్వహించడానికి DRF దళాన్ని హై అలర్ట్‌గా ఉంచారు.

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పలుచెరువులు, రిజర్వాయర్లలో నీటిమట్టాలు పెరుగుతుండటంతో వరద ముంపునకు గురికాకుండా అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.