BJP రాష్ట్ర కార్యాలయంలో ఈ రోజు రచ్చ రచ్చ జరిగింది. కొంతమంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు కార్యాలయంలోకీ డుసుకొచ్చి ఎంపీ MP ధర్మపురి అరవింద్ Dharmapuri
BJP రాష్ట్ర కార్యాలయంలో ఈ రోజు రచ్చ రచ్చ జరిగింది. కొంతమంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు కార్యాలయంలోకీ డుసుకొచ్చి ఎంపీ MP ధర్మపురి అరవింద్ Dharmapuri Aravind కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నిజామాబాద్ Nizamabad జిల్లా ఆర్మూర్, బాల్కొండ, భోదన్‌తోపాటు నిజామాబాద్ అర్బన్ కు చెందిన పలువురు బీజేపీ నేతలు కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిరసనకు దిగారు. నిజామాబాద్‌లోని 13 మండలాల అధ్యక్షులను పార్టీ నిబంధనలకు విరుద్ధంగా మార్చారని ధర్మపురి అరవింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంపీ ధర్మపురి అరవింద్ ఏకపక్ష నిర్ణయాలను వారు ఖండించారు.
రాష్ట్ర పార్టీ కార్యాలయ ఇంచార్జ్ ఉమాశంకర్, రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డిలు నిరసనకారులను సముదాయించడానికి ప్రయత్నించినా వారు వినలేదు. ఆందోళనాకారులు పెద్ద ఎత్తున్ అనినాదాలు చేయడంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక పరిస్థితులు నెలకొన్నాయి.
కొద్ది సేపటికి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి Kishan Reddy వారితో చర్చలు జరిపారు. సమస్యలుంటే తాను పరిష్కరిస్తానని, ఇలా ప్రదర్శనలు చేయడం మంచి పద్దతి కాదని వారికి నచ్చజెప్పి పంపించారు.
కాగా, 13 మండలాల అధ్యక్షులను మార్చడంలో తన ప్రమేయం ఏ మాత్రం లేదని ఢిల్లీలో ఉన్న అరవింద్ అన్నారు. జిల్లా అధ్యక్షుడే వారినిమార్చాడని ఆయన స్పష్టం చేశారు.
మొదటి నుంచీ బీజేపీ లో ఉన్న నాయకులకు, అరవింద్ కొత్తగా పార్టీలోకి తీసుకవచ్చిన నాయకులకు మధ్య నిజామాబాద్ జిల్లాలో కొంత కాలంగా అంతర్గత రచ్చ నడుస్తోంది. వారి మధ్య రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కట్ల విషయంలో అప్పుడే గొడవ మొదలయ్యింది.
BJP workers in #Telangana staged a protest against #BJP MP Nizamabad Arvind Dharmapuri at party office for unilaterally changing 13 #mandal party presidents.#Telangana#BJP #Protest #Arvind pic.twitter.com/zIWVeTr6X1
— Arbaaz The Great (@ArbaazTheGreat1) July 26, 2023