HomePoliticsNational

మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ఓడిపోతుందని తెలిసీ ఎందుకు ప్రవేశపెట్టారో తెలుసా ?

మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ఓడిపోతుందని తెలిసీ ఎందుకు ప్రవేశపెట్టారో తెలుసా ?

మణిపూర్‌లో పరిస్థితిపై నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత కూటమి తరపున కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్ల

మణిపూర్ హింసాకాండకు నిరసనగా బీజేపీకి రాజీనామా చేసిన మరో నాయకుడు
అమిత్ షా ఒత్తిడితో చివరకు కాసినో కింగ్ చీకోటిని బీజేపీలో చేర్చుకున్నారు
తెలంగాణలో కాంగ్రెస్ దే గెలుపు – ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడి

మణిపూర్‌లో పరిస్థితిపై నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత కూటమి తరపున కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా బుధవారం ఆమోదించారు. దిగువ సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

తీర్మానంపై చర్చించే తేదీ, సమయాన్ని స్పీకర్ ఇంకా నిర్ణయించలేదు. “నేను అన్ని పార్టీల నాయకులతో చర్చిస్తాను. ఆ తర్వాత‌ దీనిపై చర్చకు తగిన సమయాన్ని మీకు తెలియజేస్తాను” అని బిర్లా చెప్పారు.
కూటమి భాగస్వాములతో తీవ్ర చర్చల అనంతరం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ఇండియా కూటమి మంగళవారం నిర్ణయించింది. “ ప్రభుత్వ దురహంకారాన్ని బద్దలు కొట్టడానికి, మణిపూర్‌పై వారిని మాట్లాడేలా చేయడానికి ఈ చివరి ఆయుధాన్ని ఉపయోగించడం మా కర్తవ్యంగా భావిస్తున్నాము. ,” అని కాంగ్రెస్ నేత ఠాగూర్ అన్నారు.
బుధవారం ఉదయం 9:20 గంటలకు స్పీకర్ కార్యాలయంలో ఈ తీర్మానానికి సంబంధించిన‌ నోటీసు సమర్పించారు.

ప్రతిపక్షాలన్నీ ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ దీనిఅవల్ల మోడీ ప్రభుత్వానికి వచ్చే ముప్పేమీ లేదు. 543 మంది సభ్యులు గల సభలో , బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎకు 330 మందికి పైగా సభ్యులు ఉన్నారు, ఇండియా కూటమికి 140 మందికి పైగా సభ్యులు ఉన్నారు. 60 మందికి పైగా సభ్యులు రెండు గ్రూపులలో దేనితోనూ పొత్తులేని పార్టీలకు చెందినవారు.

మరో వైపు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, “ప్రజలకు ప్రధాని మోడీ, బిజెపిపై విశ్వాసం ఉంది. వారు గత టర్మ్‌లో కూడా అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చారు. ఈ దేశ ప్రజలు వారికి గుణపాఠం చెప్పారు.” అన్నారు.

విధివిధానాలు మరియు ప్రవర్తనా నియమాలలోని రూల్ 198 ప్రకారం లోక్‌సభలోని ఏ సభ్యుడైనా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. ఉదయం 10 గంటలలోపు సభ్యుడు మోషన్‌పై లిఖితపూర్వక నోటీసు ఇవ్వాలి, దానిని స్పీకర్ సభలో చదవాలి.
కనీసం 50 మంది సభ్యులు తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. స్పీకర్ ఆ తీర్మానంపై చర్చకు తేదీని ప్రకటిస్తారు. మోషన్ ఆమోదించబడిన రోజు నుండి 10 రోజులలోపు చర్చకు అనుమతించాలి. సభలో ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకోలేకపోతే రాజీనామా చేయాల్సి ఉంటుంది.

అయితే ఈ అవిశ్వాస తీర్మానం ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్గబోదని ప్రతిపక్షాలకు కూడా తెలుసు. నెగ్గించుకోవడానికి కావాల్సిన మెజార్టీ ప్రతిపక్షాలకు లేదు. అయినా సరే మరి ఈ అవిశ్వాస తీర్మానాన్ని ఎందుకు ప్రవేశపెట్టినట్టు?

దీనిపై ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం అంటే కేవలం సంఖ్యాబలం మాత్రమే కాదు. మేము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలకు అనుకూలమైన సంఖ్యాబలం మాకు లేదని తెలుసు. మణిపూర్ తగులబడుతోందని, దీనిపై ప్రధాన మంత్రి మోడీ మాట్లాడాలని దేశం ఎదురు చూస్తోంది. అవిశ్వాస తీర్మానం కారణంగా అయినా ఆయనతో మాట్లాడేలా చేయవచ్చు. మోడీ చేత మాట్లాడించడమే గొప్ప విజయం ” అని ఆయన చెప్పారు.

శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ, మణిపూర్ విషయంలో ఒకరు బాధ్యతను విస్మరిస్తున్నారు. మరొకరు బాధ్యతను భుజాలకెత్తుకోవడానికి తిరస్కరిస్తున్నారు. ప్రధాన మంత్రి పార్లమెంటుకు ఎందుకు రావడం లేదని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఆయనను పార్లమెంటుకు తీసుకురావడం కోసం అవిశ్వాస తీర్మానాన్ని ఉపయోగించవలసి వచ్చింది.” అని చెప్పారు.

ఒక వైపు మణిపూర్ లో హింస ప్రజ్వరిల్లుతూ ఉంటే, అక్కడ అరాచకం రాజ్యమేలుతూ ఉంటే మోడి సర్కార్ అది పెద్ద సమస్యే కాదన్నట్టు ప్రవర్తించడం, కనీసం స్పందించకపోవడాన్ని ఎలా అర్దం చేసుకోవాలి? ఈ సమస్యపై ప్రధాని మోడీతో మాట్లాడించడానికి ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ఎంచుకోవాల్సి రావడం ఎంత దౌర్భాగ్యం !