HomeTelangana

బీఆరెస్ ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్…ఎన్నిక చెల్లదంటూ తీర్పు

బీఆరెస్ ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్…ఎన్నిక చెల్లదంటూ తీర్పు

తెలంగాణ హైకోర్టు ఈ రోజు సంచలన తీర్పు ఇచ్చింది. కొత్త గూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ఎన్నిక చెల్లదంటూ తేల్చి చెప్పింది. అతనిపై పోటీ చేసి రెండవ స

సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి షాక్.. కోకాపేట స్థలం విషయంలో హైకోర్టు నోటీసులు
బీఆర్ఎస్‌ను భయపెడుతున్న అనర్హత పిటిషన్లు.. ఈ నెలాఖరుకు తేలనున్న భవితవ్యం!
నా ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా పని చేయలేనంటూ కోర్టు హాల్ లోనే హైకోర్టు జడ్జి రాజీనామా

తెలంగాణ హైకోర్టు ఈ రోజు సంచలన తీర్పు ఇచ్చింది. కొత్త గూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ఎన్నిక చెల్లదంటూ తేల్చి చెప్పింది. అతనిపై పోటీ చేసి రెండవ స్థానంలో నిల్చిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వనమా కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచి ఆపై బీఆరెస్ లో చేరారు.

ఎన్నికల అఫిడవిట్ లో వనమా వెంకటేశ్వర రావు తప్పుడు వివరాలను ఇచ్చాడంటూ జలగం వెంకట్రావు 2018 లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు 2018 నుంచి వనమా ఎమ్మెల్యే పదవీకాలం చెల్లదని స్పష్టం చేసింది. పైగా ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు వివరాలు ఇచ్చినందుకుగాను రూ. 5 లక్షల జరిమానా విధించింది.