HomeTelangana

ఉభయ కమ్యూనిస్టుల తెప్పను బీఆరెస్ తగిలేసినట్టేనా ?

ఉభయ కమ్యూనిస్టుల తెప్పను బీఆరెస్ తగిలేసినట్టేనా ?

మునుగోడు ఉపఎన్నికలప్పుడు బీఆరెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు జిగ్రీ దోస్తుల తీర్గ కావలించుకున్నాయి. కలిసి నడిచాయి. ఎప్పుడు ఎవరో ఒకరివైపు దీనంగా చూసే కమ

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రోజుకు 48 గంటలు కరెంట్ ఇస్తాడట!
70 మంది సిట్టింగులకు టిక్కట్లు గ్యారంటీ… BRS తొలి లిస్ట్ విడుదల ఎప్పుడంటే …?
బీజేపీకి బిగ్ షాక్ – రాజగోపాల్ రెడ్డి, వివేక్ లు కాంగ్రెస్ లోకి?

మునుగోడు ఉపఎన్నికలప్పుడు బీఆరెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు జిగ్రీ దోస్తుల తీర్గ కావలించుకున్నాయి. కలిసి నడిచాయి. ఎప్పుడు ఎవరో ఒకరివైపు దీనంగా చూసే కమ్యూనిస్టులు ఇక తమకు మంచి రోజులొచ్చినట్టే అని సంబరపడిపోయారు. తమది జన్మజన్మల బంధమని, ఎన్నటికీ విడిపోబోమన్న కేసీఆర్ మాటలతో పూనకాలు వచ్చిన కమ్యూనిస్టులు బీఆరెస్ లాంటి గొప్ప పార్టీ, కేసీఆర్ లాంటి మంచి నాయకుడు దేశంలోనే లేనట్టు మాట్లాడారు.

మధ్యలో కేసీఆర్ టీఆరెస్ ను జాతీయ పార్టీగా చేయడానికి పూనుకున్నప్పుడు ఉభయ కమ్యూనిస్టులు తమ జాతీయ నాయకులను ప్రగతి భవన్ కు తోడ్కొచ్చాయి. కేసీఆర్ కు అండగా ఉంటామని భరోసా ఇచ్చాయి.

ఇక అప్పటి నుంచి సీపీఐ, సీపీఎం లు అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడెక్కడ పోటీ చేయాలో, ఎక్కడైతే గెలుస్తామో, కేసీఆర్ ను ఎన్ని సీట్లు అడగాలో లెక్కలేసుకుంటున్నాయి. కనీసం చెరి ఆరు సీట్లు ఇవ్వకపోతాడా అని ఆ రెండు పార్టీలు నమ్మకంగా ఉన్నాయి.

ఏ ఏ సీట్లు అడగాలో ఆ సీట్లలో ఎవరెవరు పోటీ చేయాలో కూడా ఎవరికి వారు డిసైడ్ అయిపోయారు కూడా. అయితే అనుకున్నది ఒకటైతే అయ్యింది మరొకటి. రాజకీయాల్లో తలపండిన కేసీఆర్ చాణక్యం ముందు వామపక్షాల మొహాలు వెలవెల బోతున్నాయి. చెరో ఎమ్మెల్యే సీటు, చెరో ఎమ్మెల్సీ సీటు ఇస్తామని బీఆరెస్ నుండి లీకులు వచ్చాయి. అయినా తల దించని యోధులైన వామపక్ష నేతలు తమకు కేసీఆర్ కనీసం నాలుగేసి సీట్లైనా ఇస్తారని ఆసవదులు కోలేదు.

ఇక కేసీఆర్ అయితే వామపక్షాలను పట్టించుకోవడమే మానేశారని సమాచారం. మునుగోడులో అయితే సీపీఐ కి కనీసం ఓ 5 వేల ఓత్లు ఉన్నాయి. ఆ ఓట్లు చాలా అవసరం కాబట్టి. అప్పుడు బీఆరెస్ కు. వామపక్షాల అవసరం చాలా ఉండింది. అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో అవసరమేంటి అని బీఆరెస్ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక మంత్రి హరీశ్ రావైతే ఓ అడుగు ముందుకేసి ఉభయ కమ్యూనిస్టు పార్టీల దుమ్ము దులిపేశారు. సిద్దిపేట లో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి అంగన్‌వాడీల ఆత్మీయ సమ్మేళనంలో, ఆశ కార్యకర్తల సమావేశాల్లో హరీశ్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీపీఐ, సీపీఎం వాళ్ళకు రాష్ట్రంలో ఎక్కడా కార్యకర్తలు గతి లేక అంగన్‌వాడీలను, ఆశా వర్కర్లను వాడుకుంటున్నారని, వారి వలలో పడొద్దని అన్నారు.

”సీపీఐ, సీపీఎం వాళ్ల యూనియన్ల కోసం మిమ్మల్ని రోడ్ల మీదికి తెస్తారు. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని బలం చూపించే కుట్ర చేస్తారు. ఆ పార్టీలకు మనుషులు లేరు, కార్యకర్తలు లేరు. ఏమన్నా అంటే అంగన్‌వాడీలను, ఆశ వర్కర్లను రోడ్ల మీదికి తెచ్చి మధ్యలో వాళ్ల జెండా పడుతరు. ఆ ఉచ్చులో పడి నష్టపోవద్దు. ఆ పార్టీలు మిమ్మల్ని రాజకీయాల కోసం వాడుకొంటున్నాయి.” అని వామపక్షాలపై విరుచుకపడ్డారు.

కేసీఆర్ మనసు తెలిసే హరీశ్ రావు ఇలా మాట్లాడి ఉంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలను దగ్గరికి రానియ్యొద్దన్న నిర్ణయం కేసీఆర్ తీసుకున్నట్టే కనపడుతోంది. మునుగోడు ఎన్నికల సందర్భంగా కేసీఆర్ నుండి పలు ప్రయోజనాలను పొందిన ఉభయ కమ్యూనిస్టులు. తమకు అవే ఎక్కువని సంత్రుప్తి చెందుతారా లేక బీఆరెస్ ను ఓడించి తీరుతామని రంగంలోకి దిగుతారా అనేది మరి కొద్ది రోజుల్లో తేలిపోనుంది.