తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ తెలంగాణ బీఆరెస్ సర్కార్ ను ముప్పు తిప్పలు పెడుతున్నారు. బిల్లులు పాస్ చేయకపోవడం,గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా ప్రభ
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ తెలంగాణ బీఆరెస్ సర్కార్ ను ముప్పు తిప్పలు పెడుతున్నారు. బిల్లులు పాస్ చేయకపోవడం,గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా ప్రభుత్వం ప్రతిపాధించిన కౌశిక్ రెడ్డిని తిరస్కరించడం తదితర అంశాల వల్ల తెలంగాణ సర్కార్ కు గవర్నర్ కు పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థి నెలకొంది. ఈ మధ్య ఆమె కొద్దిగా వెనక్కి తగ్గినట్టు సూచనలు కనిపించినప్పటికీ ఆమె గవర్నర్ కన్నా ఎక్కువగా రాజకీయ నాయకురాలిగానే ప్రవర్తిస్తున్నారని బీఆరెస్ విమర్శలు గుప్పిస్తోంది.
నిజానికి తమిళిసై తెలంగాణ గవర్నర్ గా నియమితులవడానికన్నా ముందు. తమిళనాడు బీజేపీకి అధ్యక్షురాలిగా పని చేసింది. రాజకీయాల్లో చాలా చురుకుగా ఉండే ఆమెను గవర్నర్ గా నియమించడంతో ఆమె కొంత ఇబ్బంది పడ్డారు కూడా. ఆమె ప్రస్తుతం తెలంగాణకే కాకుండా పుదుచ్చేరికి కూడా గవర్నర్ గా ఉన్నారు.
అయితే ఆమె రాజకీయ ఆశలు ఇప్పటికీ వదులుకోలేదని అర్దమవుతోంది. ఇప్పటికీ ఆమెకు గవర్నర్ గా ఉండటంకన్నా ఎంపీగా ఉండాలన్న కోరిక బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ విషయంలో ఆమె తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. తమిళనాడు నుండి ఎంపీగా గెలిచి పార్లమెంటుకు వెళ్ళాలని ఆమె కోరుకుంటుందనడానికి ఉఅదహరణ ఆమె నిన్న మాట్లాడిన మాటలే.
పుదుచ్చేరి లోని కదిర్ గ్రామంలో ఇందిరాగాంధీ ప్రభుత్వ వైద్య కళాశాలలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంటోంది. దీనికి తోడు అల్ట్రా సౌండ్ చికిత్సలకు సంబంధించి పాఠాలు బోధించే అధ్యాపకులు కూడా లేరు. ఈ వివరాలు గవర్నర్ తమిళిసై తెలుసుకుని తానే ఆ కళాశాలలో విద్యార్థులకు పాఠాలు బోధించనున్నట్లు విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
ఈ సందర్భంగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని విలేఖరులు ఆమెను ప్రశ్నించగా, ” రెండు రాష్ట్రాల గవర్నర్‌గా ఇప్పుడు శక్తివంచన లేకుండా కృషి చేశ్తున్నాను. ఇక నేను ఎంపీ పదవికి పోటీ చేయాలనే విషయం పైనున్న దేవుడు, పైనున్న పాలకులు నిర్ణయం తీసుకోవాలి. నాఅంతల నేనుగా ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేను.” అని ఆమె పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలతో ఆమె పార్లమెంటు కు పోటీ చేయాలని కోరుకుంటున్నారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.