HomeTelangana

దివ్యాంగులకు కేసీఆర్ శుభవార్త… పింఛన్ పెరిగింది

దివ్యాంగులకు కేసీఆర్ శుభవార్త… పింఛన్ పెరిగింది

దివ్యాంగుల disabled People కు కేసీఆర్ KCR సర్కార్ శుభవార్త వినిపించింది. ఇప్పటి వరకు వారికి వస్తున్న పింఛన్ ను పెంచుతూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.ఈ

KCRతో తన రహస్య భేటీ గురించి బైటపెట్టి మోడీ కాంగ్రెస్ కు ఆయుధమిచ్చారా ?
కాంగ్రెస్ గ్యారెంటీలు టిష్యూ పేపర్లు…ఒక్క సీటులో కూడా బీజేపీకి డిపాజిట్ రాదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ఎన్నికల్లో బీఆరెస్సే గెలుస్తుందని చెప్పేసిన బండి స‍ంజయ్

దివ్యాంగుల disabled People కు కేసీఆర్ KCR సర్కార్ శుభవార్త వినిపించింది. ఇప్పటి వరకు వారికి వస్తున్న పింఛన్ ను పెంచుతూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు దివ్యాంగుల పింఛన్ ను రూ. 1,000 పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నెలా రూ. 3,016 పెన్షన్ ను అందుకుంటున్న దివ్యాంగులు, ఈ పెంపుతో రూ. 4,016 పెన్షన్ ను అందుకోబోతున్నారు. మంచిర్యాల సభ వేదికగా దివ్యాంగుల పింఛన్ ను పెంచబోతున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ , సంబంధిత ఫైల్ ను ఆమోదించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అత్యధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని బీఆరెస్ నాయకులు చెప్తున్నారు.

కాగా, దివ్యాంగుల పింఛన్ ను పెంచుతూ ఉత్వర్వులు వెలువడిన సందర్భంగా …ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు పుష్పగుచ్ఛం అందించి ధన్యవాదాలు తెలిపారు.