HomeNationalCrime

అధికార పార్టీ అండ: యూనివర్సిటీ VC, అధికారులు, పోలీసులను చితకబాదిన ABVP గ్యాంగ్

అధికార పార్టీ అండ: యూనివర్సిటీ VC, అధికారులు, పోలీసులను చితకబాదిన ABVP గ్యాంగ్

ఆరెస్సెస్, బీజేపీ అనుబంద విద్యార్థి సంఘం అఖిలభారతీయ విద్యార్థి సంఘం ABVP అరాచకం సృష్టి‍ంచింది. యూనివర్సిటీ క్యాంపస్ లోకి చొచ్చుకపోయిన ABVP గ్యాంగ్, వ

కాంగ్రెస్ మార్క్ గూండాయిజం: కాంగ్రెస్ గ్రూపుల మధ్య కొట్లాట – జర్నలిస్టులను చితకబాదిన కాంగ్రెస్ నేతలు
ఇజ్రాయిల్ పై 5వేల రాకెట్లతో దాడి చేసిన హమస్
ఈక్వెడార్‌లో టీవీ న్యూస్‌ ఛానల్‌పై దుండగుల దాడి – లైవ్ లో ప్రసారం

ఆరెస్సెస్, బీజేపీ అనుబంద విద్యార్థి సంఘం అఖిలభారతీయ విద్యార్థి సంఘం ABVP అరాచకం సృష్టి‍ంచింది. యూనివర్సిటీ క్యాంపస్ లోకి చొచ్చుకపోయిన ABVP గ్యాంగ్, వారితో మరికొంత్ అమంది బైటి వ్యక్తులు కలిసి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ Vice-Chancellor, రిజిస్ట్రార్ registrar , ఇతర అధికార్లు, పోలీసులపై విచక్షణా రహితంగా దాడి చేశారు. అందరినీ చితకబాదారు. ఈ సంఘటనలో అనేక మందికి తీవ్రగాయాలయ్యాయి.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్వంత ఊరు ఘోరక్ పూర్ లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయం Deen Dayal Upadhyaya Gorakhpur University లో ఫీజుల పెంపు, ఇతర సమస్యలపై శుక్రవారం నాడు ABVP గ్యాంగ్, క్యాంపస్ వెలుపల నుండి వచ్చిన వ్యక్తుల బృందం వైస్-ఛాన్సలర్‌తో సహా విశ్వవిద్యాలయ అధికారులపై దాడి చేసి ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు ప్రయత్నించిన పోలీసు అధికారులపై కూడా వారు దాడి చేశారు.

వైస్-ఛాన్సలర్ రాజేష్ సింగ్, రిజిస్ట్రార్ అజయ్ సింగ్ లపై బల‌మైన‌ వస్తువుతో దాడి చేయడంతో తలకు గాయాలయ్యాయి.

“పోలీసుల సమక్షంలో, విద్యార్థులు, బయటి వ్యక్తులు క్యాంపస్‌లో గొడవ సృష్టించారు. పోలీసులు విద్యార్థులను ఒప్పించేందుకు ప్రయత్నించినా వారు వారు వినలేదు. దీంతో యూనివర్శిటీ అధికారులను క్యాంపస్ నుంచి సురక్షితంగా బయటకు తీసుకురావాలని పోలీసులు నిర్ణయించారు. V-Cని సురక్షితంగా తీసుకెళ్తున్నప్పుడు, దుండగులు అతనిపై దాడికి దిగారు ”అని పేరు చెప్పడానికి ఇష్టపడని విశ్వవిద్యాలయ అధికారి చెప్పారు.

“దుండగులు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అజయ్ సింగ్‌పై దాడి చేసి గాయపరిచారు. అతను నేలపై పడడంతో, దుండగులు అతనిని కాళ్ళతో తొక్కారు, దారుణంగా కొట్టడంతో గాయాలు అయ్యాయి. వారు అతని తలపై బలమైన వస్తువుతో కొట్టారు. తరువాత, పోలీసులు అతనిని సురక్షితమైన ప్రదేశానికి తరలించారు, ”అని అధికారి చెప్పారు, ఈ సంఘటనలో గతంలో విశ్వవిద్యాలయ పరిపాలకులు బ్లాక్‌లిస్ట్ చేసిన కొంతమంది కాంట్రాక్టర్లు కూడా ఉన్నారని చెప్పారు.

‘‘సీసీటీవీలో ఈ ఎపిసోడ్ రికార్డైంది. హింసలో కొంత మంది బయటి వ్యక్తులు ఉన్నారు. కాంట్రాక్టర్లతో సహా విద్యార్థులు, బయటి వ్యక్తుల పేర్లతో సహా మేము పోలీసులకు ఫిర్యాదు చేసాము. ”అని విశ్వవిద్యాలయ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

హింసకు పాల్పడిన విద్యార్థులను బహిష్కరిస్తున్నామని, వారి పేర్లను శనివారం వెల్లడిస్తామని ఆయన చెప్పారు.
గోరఖ్‌పూర్‌లోని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవ్ గ్రోవర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం ఫిర్యాదును సమర్పించిందని, కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. కొందరిని విచారిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

బిజెపి గోరఖ్‌పూర్ జిల్లా అధ్యక్షుడు యుధిస్టార్ సింగ్ మాట్లాడుతూ, “ఈరోజు విషయం గురించి నాకు పూర్తి సమాచారం లేదు. ఏబీవీపీ సభ్యులు నిరసనకు దిగినట్లు నేను విన్నాను” అన్నారు.

అయితే ముఖ్యమంత్రి సొంతూర్లోనే ఏబీవీపీ గ్యాంగ్ విధ్వంసానికి పాల్పడటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధికార పార్టీ అండ చూసుకుని విర్రవీగుతున్నారని మండిపడుతున్నారు. వర్సిటీల్లో ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.