HomeTelanganaPolitics

కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం: కలకలం రేపుతున్న BJP నేతల వివాదాస్పద‌ వ్యాఖ్యలు

కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం: కలకలం రేపుతున్న BJP నేతల వివాదాస్పద‌ వ్యాఖ్యలు

గందరగోళంగా తయారైన తెలంగాణ బీజేపీ BJPలో కిషన్ రెడ్డి Kishan Reddy అధ్యక్షుడయ్యాక పరిస్థితులు చక్కబడుతాయని అధిష్టానం భావిస్తున్న తరుణంలో అసమ్మతి అలాగే

బీజేపీలో మల్కాజిగిరి రాజకీయం.. ఆ సీటుపై కన్నేసిన ఈటల… ఆయనకు రాకుండా చక్రం తిప్పుతున్న బండి
బండి సంజయ్ కి కీలక పదవి – ప్రకటించిన నడ్డా
వ్యాగన్ల ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన మోడీ…కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని, రిపేర్ షాపు ఇస్తారా అంటూ ప్రశ్నించిన కేటీఆర్

గందరగోళంగా తయారైన తెలంగాణ బీజేపీ BJPలో కిషన్ రెడ్డి Kishan Reddy అధ్యక్షుడయ్యాక పరిస్థితులు చక్కబడుతాయని అధిష్టానం భావిస్తున్న తరుణంలో అసమ్మతి అలాగే ఉందనే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ రోజు బీజేపీ నూతన అధ్యక్షుడుగా కిషన్ రెడ్డి పదవీ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, బండి సంజయ్ Bandi Sanjay ని అధ్యక్షపదవి నుంచి తీసివేయడాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడటంటొ అక్కడున్న జాతీయ నాయకులూ అవాక్కయ్యారు. అంతే కాదు తన మీద ఢిల్లీలో పిర్యాదు చేసిన వారిపై స్వయంగా బండి సంజయ్ విమర్శలు గుప్పించడం కలకలం రేపింది.

ఈటెల రాజేందర్ Etela Rajendar ను దృష్టిలో పెట్టుకొని బండి సంజయ్ ఆ మాటలు మాట్లాడారనే వ్యాఖలు వినిపిస్తున్నాయి. లేనిపోని అబద్దాలు అధిష్టానానికి తనపై చెప్పి తనను పదవి నుంచి తప్పించారని ఆయన ఆరోపించారు.

ఇక ఆపై విజయశాంతి Vijayashanthi ఎపిసోడ్ పార్టీ వర్గాల్లో మరింత కలవరం సృష్టించింది. సమావేశం మధ్యలోనే లేచి వెళ్ళిపోయిన ఆమె ఇంటికి వెళ్ళగానే చేసిన ట్వీట్ పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. పార్టీలో అసమ్మతి ఇంకా పోలేదని పోయే జాడ కూడా కనపడటం లేదని పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు.

కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపడానికి వచ్చానని, అయితే తెలంగాణ Telangana ను వ్యతిరేకించిన, తెలంగాణకు బద్ద వ్యతిరేకులు, తెలంగాణ ఉద్యమంపై ఉక్కుపాదం మోపిన వారితో తనకు వేదిక పంచుకోవడం ఇష్టంలేక మధ్యలో వచ్చేసినట్లు విజయశాంతి ట్వీట్ లో పేర్కొన్నారు.

”బీజేపీ అధ్యక్షులుగా కిషన్ రెడ్డి గారి ప్రమాణస్వీకార కార్యక్రమం మధ్యలో
వచ్చేశానని పాత్రికేయ మిత్రులు అడుగుతున్నారు.

అది, సరి కాదు.
కిషన్ రెడ్డి గారిని అభినందించి, శుభాశీస్సులు తెలియచేసిన తరువాతే వచ్చాను.

ఐతే, నాడు తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణవాదాన్ని ఉక్కుపాదంతో అట్టడుగుకు అణిచివేయాలని ప్రయత్నించిన వారు ఎవ్వరైనా ఉన్న సందర్భంలో, అక్కడ ఉండటం నాకు అసౌకర్యం, అసాధ్యం
ఆ పరిస్థితి వల్ల ముందుగానే వెళ్లవలసి వచ్చింది..

జై శ్రీరామ్

హర హర మహాదేవ

జై తెలంగాణ” అని విజయశాంతి ట్వీట్ చేశారు.

ఇంతకు కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉన్న తెలంగాణ వ్యతిరేకులు ఎవరనే చర్చ ప్రారంభమైంది. అక్కడ ఉన్న వాళ్ళంతా తెలంగాణకు మద్దతు తెలిపివారే కానీ ఒక్క కిరణ్ కుమార్ రెడ్డి Kirankumar Reddy తప్ప. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనడం. వేదిక మీద ఉండటంతోనే విజయశాంతి వెళ్ళిపోయారనేది స్పష్టం.

తన ప్రమాణ స్వీకారం రోజే నేతలు చేసిన వివాదాస్పద కామెంట్లపై కిషన్ రెడ్డి ఎలా స్పందిస్తారో, అందరిని ఎలా కలుపుకపోతారో వేచి చూడాలి.