HomeNationalEditor's Choice

దుబాయ్ నుంచి సూట్ కేసులో10 కిలోల టమాటాలు తెచ్చిన‌ మహిళ‌

దుబాయ్ నుంచి సూట్ కేసులో10 కిలోల టమాటాలు తెచ్చిన‌ మహిళ‌

దేశంలో టమాటాల tomatoes రేట్లు బంగారం Gold రేట్లతో పోటీ పడుతున్నాయి. కిలో టమాటాలు `150 రూపాయల నుండి 250 రూపాయల వరకు పలుకుతున్నాయి. రైతులు Farmers తమ ట

రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి తీరుతాం… స్పష్టం చేసిన కాంగ్రెస్ ఇంచార్జ్
తెలంగాణ రైతులకు ఇండిపెండెంట్ ‍డే గిఫ్ట్.. లక్ష లోపు రుణాల మాఫీ
ఆ మహిళ సోనియా చెవిలో ఏం చెప్పిందో ఊహించగలరా ?

దేశంలో టమాటాల tomatoes రేట్లు బంగారం Gold రేట్లతో పోటీ పడుతున్నాయి. కిలో టమాటాలు `150 రూపాయల నుండి 250 రూపాయల వరకు పలుకుతున్నాయి. రైతులు Farmers తమ టమాటా పంటలను కాపాడుకోవడానికి రాత్రింబవళ్ళు కాపలా కాస్తున్నారు. లక్షల రూపాయల విలువ చేసే టమాటాలను పంటచేల నుంచే దొంగలు ఎత్తుకపోతున్నారు. టమాటాల రక్షణకు వ్యాపారులు బౌన్సర్లను వినియోగించుకుంటున్నారు.

ఈ పరిస్థితుల్లో ఆహారంలో టమాటాలేనిదే ముద్ద దిగని అనేక మంది అరకిలో వాడే చోట ఒక్క టమాటాతో సరిపెట్టు కుంటున్నారు. కొందరి ఇళ్ళల్లో అయితే ప్రస్తుతం టమాటా వాడకం నిషేదం అయ్యింది. ఈ నేపథ్యంలో ఓ మహిళ నాలిక‌ ఎలాగైనా టమాటా తినాలని కొన్ని రోజులుగా తహతహలాడుతోంది. దా‍ంతో ఆమె ఏకంగా దుబాయ్ Dubai నుంచే టమాటాలను తెప్పించింది.

నార్త్ ఇండియాకు చెందిన ఈ మహిళ కూతురు దుబాయ్ లో పనిచేస్తోంది. సెలవుల holidays పై ఇండియా India రావాలనుకుంది. తల్లికి తాను ఇంటికి వస్తున్నాను దుబాయ్ నుండి నీకు ఏమి కావాలని అడిగింది. ఆ తల్లి వెనకాముందు ఏమీ ఆలోచించకుండా 10 కిలోల టమాటాలు తెమ్మని కోరింది. వెంటనే ఆ కూతురు తల్లి కోరిక తీర్చేందుకు దుబాయ్ లో 10 కిలోల టమాటాలు కొని సూట్ కేసులో పెట్టుకొని తీసుకవచ్చింది.

ఈ వృత్తాంతాన్ని పంచుకుంటూ, ట్విట్టర్‌లో Twitter రెవ్స్ అనే పేరుతో ఉన్న ప్రవాస సోదరి ఇలా వ్రాశారు: “నా సోదరి తన పిల్లల వేసవి సెలవుల కోసం దుబాయ్ నుండి భారతదేశానికి వస్తోంది, ఆమె దుబాయ్ నుండి ఏదైనా కావాలా అని మా అమ్మను అడిగారు. మా అమ్మ 10 కిలోల టమోటాలు తీసుకురండని అడిగారు . అందుకే ఇప్పుడు 10 కేజీల టమాటాలను సూట్‌కేస్‌లో ప్యాక్ చేసి తీసుకెళ్ళింది.” అని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ట్విట్టర్ లో ఈ పోస్ట్ కు 53.2 వేల వ్యూస్ వచ్చాయి. ఈ పోస్ట్ ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. నెటిజనులు తమదైన పంచులతో ఈ కథను మరింత వినోదభరితంగా మార్చారు.

నయనతార బాగ్లా అనే ట్విటర్ యూజర్ ఇలా అన్నారు: “ఈ ద్రవ్యోల్బణం సమయాన ఆమెకు ఉత్తమ కుమార్తె అవార్డు ఇవ్వాల్సిందే” అని కామెంట్ చేయగా

మరొక నెటిజన్ ఆమె సోదరి “ఒక కుమార్తెల్లో దేవదూత‌” అని వ్యాఖ్యానించారు.

కాగా మరో వైపు నేపాల్ నుంచి భారత్‌కు అక్రమంగా తరలిస్తున్న మూడు టన్నుల టమోటాలను కస్టమ్స్ అధికారులు ఇటీవల సీజ్ చేశారు.

టొమాటోలు నేపాలీ కరెన్సీలో రూ. 100 నుండి రూ. 110 వరకు ఉన్నాయి, ఇది భారతదేశంలో రూ. 62-69.

నివేదికల ప్రకారం, రుతుపవనాలు ఆలస్యం కావడం, అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ ఉత్పత్తి కారణంగా ఇటీవల టమోటా ధరలు విపరీతంగా పెరగడానికి కారణం. భారీ వర్షాలు కూడా ధరలు గణనీయంగా పెరగడానికి కారణమయ్యాయి.