హైదరాబాద్ లో వర్షాలు విరామం లేకుండా కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమయిపోయింది. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలన్నింటికీ గురు , శుక్రవారాలు సెలవులు ప్రకటిం
హైదరాబాద్ లో వర్షాలు విరామం లేకుండా కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమయిపోయింది. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలన్నింటికీ గురు , శుక్రవారాలు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం కొద్ది సేపటి క్రితం హైదరాబాద్ లో Hyderabad మరో రోజు సెలవును పొడిగించింది. ప్రభుత్వ కార్యాలయాలకు కూడా శుక్ర, శనివారాలు సెలవుగా ప్రకటించింది.
ఎడతెరిపిలేని వర్షాల కారణంగా, జీహెచ్ఎంసీ GHMC పరిథిలోని అన్ని రకాల విద్యాసంస్థలు సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రేపు ఎల్లుండి (శుక్ర శని వారాలు) రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కొద్దిసేపటి క్రితం ఆదేశించారు.
వైద్యం, పాల సరఫరా తదితర అత్యవసర సేవలు కొనసాగుతాయని సిఎం తెలిపారు.అదే సందర్భంలో…..ప్రయివేట్ సంస్థలు కూడా వారి వారి కార్యాలయాలకు సెలువులు ప్రకటించేలా చర్యలు చేపట్టాలని కార్మికశాఖ ను సిఎం కేసీఆర్ ఆదేశించారు.