HomeUncategorized

హమ్మయ్య! ఎట్టకేలకు మోడీ గొంతు విప్పారు

హమ్మయ్య! ఎట్టకేలకు మోడీ గొంతు విప్పారు

మూడు నెలలుగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్ Manipur మండిపోతోంది కానీ ప్రధాని Prime minister నరేంద్ర మోడీ Narendra Modi దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదు. వం

‘కవితకు ఈడీ నోటీసులు పెద్ద డ్రామా’
‘ఇండియా’ కూటమికి మోడీ భయపడుతున్నాడా ?
బుల్డోజర్ రాజ్యంలో ఈ వృద్దులు, మహిళలు చేసిన పాపమేంటి ? తప్పు ఒకరు చేస్తే మరొకరిని రోడ్డుపాలు చేస్తారా ?

మూడు నెలలుగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్ Manipur మండిపోతోంది కానీ ప్రధాని Prime minister నరేంద్ర మోడీ Narendra Modi దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదు. వందలాది ఇళ్ళను దుండగులు కాల్చి బూడిద చేశారు అయినా మోడీ గొంతు విప్పలేదు. పోలీసులపై, పోలీసుల ఎదురుగానే అమాయక ప్రజలపై దాడులు జరిగాయి మోడీ మాట్లాడలేదు. అత్యాచారాలు జరిగాయి మోడీ మాట్లాడలేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 157 మంది హత్యకు గురయ్యారు మోడీ మాట్లాడలేదు. 50 వేల మంది ఇళ్ళు కోల్పోయి రోడ్ల పాలయ్యారు అయినా సరే మోడీ మాట్లాడలేదు. అత్యాచారాలు, దొమ్మీలు, దొంగతనాలు, షాపుల లూటీలు, కాల్చివేతలు, కూల్చి వేతలు…ఒకటేమిటి మణిపూర్ అల్లకల్లోమయ్యింది. అయినా సరే ప్రధాని నరేంద్ర మోడీ అది తన దేశం కానట్టే ప్రవర్తించారు.

మూడు నెలల తర్వాత…ఇంత కాలానికి…ఎట్టకేలకు మోడీ నోరు తెరిచారు. మణిపూర్ లో జరిగిన ఓ సంఘటనపై స్పందించారు. ప్రపంచమంతా నివ్వెరపోయి చూసిన ఆ సంఘటనపై స్పందించక తప్పలేదు.

మణిపూర్‌లో కుకీ‍జో జాతికి చెందిన ఇద్దరు యువతులను మైతీలకు చెందిన‌ గుంపు రోడ్డుపై నగ్నంగా ఊరేగించి ఆపై వారిద్దరిపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ సంఘటన మే 4న జరగగా ఆ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఆ దుర్మార్గఘటనను చూసి ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. ఇక దీనిపై మోడీకి కూడా మాట్లాడక తప్పలేదు.

మణిపూర్ సంక్షోభంపై తొలిసారిగా తన మౌనాన్ని వీడిన ప్రధాని నరేంద్ర మోడీ గురువారం “మణిపూర్ కుమార్తెలకు జరిగిన దానిని క్షమించలేము” అని అన్నారు.

వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక రోజు తర్వాత ప్రధానమంత్రి ఈ వ్యాఖ్య చేశారు.

“నేరస్తులను criminals విడిచిపెట్టబోమని నా దేశప్రజలకు నేను హామీ ఇవ్వాలనుకుంటున్నాను. మణిపూర్ కుమార్తెలకు జరిగిన దాన్ని ఎప్పటికీ క్షమించలేం’’ అని పార్లమెంట్ వర్షాకాల సమావేశానికి ముందు ప్రసంగిస్తూ ప్రధాని మోడీ అన్నారు.

“చట్టం తనకున్న‌ శక్తితో ఒక అడుగు తర్వాత మరొక అడుగు వేస్తుంది. ఒక్క దోషిని కూడా విడిచిపెట్టబోమని దేశప్రజలకు నేను హామీ ఇస్తున్నాను.” అన్నారు మోడీ

ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు Parliamentకు రాకముందు తన హృదయం బాధతో, కోపంతో నిండిపోయిందని ప్రధాని అన్నారు.

“మణిపూర్‌లో వెలుగు చూసిన సంఘటన ఏ నాగరిక సమాజానికైనా అవమానకరమైన సంఘటన. దేశం మొత్తం సిగ్గుతో తలదించుకుంది… దీని వల్ల 140 కోట్ల మంది ప్రజలు సిగ్గుపడుతున్నారు. నేరాలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా మన తల్లులు, కుమార్తెలపై జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకునేలా చట్టాలను పటిష్టం చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను” అని ప్రధాని మోదీ అన్నారు.

షెడ్యూల్డ్ తెగ (ST) కేటగిరీలో గిరిజనేతర మెయిటీలను చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ, తమ‌ హక్కులు, రాజ్యాంగపరమైన భద్రతలను కాపాడాలని కుకీ, నాగా కోరుతూ ఆదివాసులు మే 3న ‘గిరిజన సాలిడారిటీ మార్చ్’ Tribal Solidarity March నిర్వహించారు. ఆ తర్వాత, మణిపూర్‌లోని గిరిజనేతర మైటీ కమ్యూనిటీల మధ్య జాతి ఘర్షణలు చెలరేగాయి. పోలీసు Police డేటా ప్రకారం, హింసాకాండలో ఇప్పటివరకు 157 మంది ప్రాణాలు కోల్పోయారు. 50,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు.