HomeNationalGeneral

మావోయిస్టుల జాడ తెలుసుకునేందుకు.. పావురాలకు పోలీసు శిక్షణ

మావోయిస్టుల జాడ తెలుసుకునేందుకు.. పావురాలకు పోలీసు శిక్షణ

ఒడిషాలో దశాబ్దాల కాలంగా పావురాలు.. పోలీసు శాఖలో భాగంగా పని చేస్తున్నాయి.

గంజాయి సరఫరా చేస్తున్న ఏపీ పోలీసులు – పట్టుకున్న తెలంగాణ పోలీసులు
ట్యూషన్ టీచర్ ను పొడిచి చంపిన బాలుడు
గ్రామంపై దాడి,ప్రజలపై హింస, సామూహిక అత్యాచారాలు: 215 మంది పోలీసు, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులకు జైలు శిక్ష‌

మావోయిస్టుల కార్యకలాపాలపై కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు నిత్యం అప్రమత్తంగా ఉంటాయి. ప్రస్తుతం ఎన్నో రకాల సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. వాటి సాయంతో మావోయిస్టుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అయితే ఒడిషా రాష్ట్రం మాత్రం ఒక పాత పద్దతిని ఇంకా కొనసాగిస్తుండటం గమనార్హం. ఆధునిక టెలీకమ్యునికేషన్ వ్యవస్థ, శాటిలైట్లు, డ్రోన్లు వంటివి అందుబాటులో ఉన్నా.. ఒకప్పటి పావురాల వ్యవస్థను పరిమితంగా కొనసాగిస్తుండటం గమనార్హం.

ఒడిషాలో దశాబ్దాల కాలంగా పావురాలు.. పోలీసు శాఖలో భాగంగా పని చేస్తున్నాయి. దేశంలో ఇప్పట్లా కమ్యునికేషన్ల వ్యవస్థ అందుబాటులోకి రాక ముందు నుంచే వీటిని వినియోగిస్తున్నారు. ఎన్నికలు, ప్రకృతి విపత్తులు వంటివి ఏర్పడిన సమయంలో పావురాల సేవలు ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం మావోయిస్టుల జాడ తెలుసుకునేందుకు పరిమిత సంఖ్యలో పావురాలను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తున్నది. కటక్‌లోని ఒడిశా పోలీస్ హెడ్ క్వార్ట్సర్స్‌లో 105, అనుగుల్ పోలీస్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో 44 పావురాలకు శిక్షణ ఇస్తున్నారు.

ఒడిశా రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న కొరాపుట్, మల్కన్‌గిరి జిల్లాల్లో వారి కదలికలను తెలుసుకునేందుకు మొదటి సారి పావురాలతో నిఘా ఏర్పాటు చేశారు. అప్పట్లో అది విజయవంతం కావడంతో.. వాటిని ఇతర ప్రాంతాల్లో కూడా వినియోగించారు. పలు జిల్లాల్లో 19 పావురాల శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక ఇన్‌స్పెక్టర్, ముగ్గురు ఎస్సైలు, ఒక ఏఎస్ఐ, 35 మంది కానిస్టేబుళ్లను కేటాయించారు. 90వ దశకం చివరి నుంచి వైర్‌లెస్, టెలిగ్రాఫ్, టెలిఫోన్ సేవలు విస్తృతమవడంతో వాటి సంఖ్య తగ్గించుకుంటూ వచ్చారు. కానీ, ఇప్పటికీ రెండు కేంద్రాల్లో పావురాలను పెంచుతూ.. వాటిని పరిమితంగా ఉపయోగిస్తున్నారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కమ్యునికేషన్ల వ్యవస్థ పని చేయకపోతే.. పావురాలను వాడుతున్నట్లు అధికారులు చెప్పారు. పావురాలు చాలా తెలివైనవని, వాటి చూపు కూడా తీక్షణంగా ఉంటుందని అంటున్నారు. పావురాళ్ల కాళ్లకు చిన్న మైక్రో కెమేరా పెట్టి అడవుల్లో తిరగి వచ్చేలా చేయడం ద్వారా మావోయిస్టులపై నిఘా ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది. డ్రోన్లు అయితే మావోయిస్టులు గుర్తు పట్టి.. వాటిని పేల్చేసే అవకాశం ఉన్నందున.. పావురాలను ఉపయోగిస్తున్నారు. ఇవి ఒక సారి ఎగరడం మొదలు పెడితే దాదాపు 400 నుంచి 500 కిలోమీటర్ల వరకు ఆగకుండా ప్రయాణించడం పోలీసులకు కలిసి వస్తోంది.

ప్రస్తుత ఆధునిక కాలంలో పావురాలను పెంచి, శిక్షణ ఇవ్వడంపై కాగ్ అభ్యంతరం తెలిపింది. వెంటనే ఈ తరహా సేవలను నిలిపేయాలని ఒడిశా ప్రభుత్వానికి సూచించింది. కానీ, సీఎం నవీన్ పట్నాయక్ మాత్రం వాటిని కొనసాగించడానికే మొగ్గు చూపారు.