HomeTelanganaPolitics

మధుయాష్కీ, పొంగులేటికి కాంగ్రెస్ లో కీలక పదవులు

మధుయాష్కీ, పొంగులేటికి కాంగ్రెస్ లో కీలక పదవులు

కొద్ది రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన ఊపు పెంచింది. కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ లో ఆ పార్టీకి

55 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్
కాంగ్రెస్: 70 స్థానాల్లో అభ్యర్థులు ఫైనల్ , 30 సీట్లలో తీవ్ర పోటీ
కాంగ్రెస్ లో సెకండ్ లిస్ట్ చిచ్చు…రాజీనామాలు, ఏడుపులు, శాపనార్దాలు

కొద్ది రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన ఊపు పెంచింది. కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ లో ఆ పార్టీకి వచ్చిన పాజిటీవ్ వాతావరణాన్ని వాడుకోవడానికి ఆ పార్టీ తీవ్రప్రయత్నాలు చేస్తున్నది. మరో వైపు కొంత కాలం క్రితం వరకు తెలంగాణలో హైప్ సృష్టించికున్న‌ బిజెపి చతికలపడటంతో అనేక మంది నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారు.

ఈ నేపథ్యంలో AICC ఈ రోజు తెలంగాణలో గెలుపే లక్ష్యంగా టీపీశీశీ ప్రచార కమిటీని ప్రకటించింది. ఈ మేరకు AICC జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విధుదల చేశారు.

మజి ఏంపి మధు యాష్కీని ప్రచార కమిటీ చైర్మెన్ గా, ఈ మధ్యే కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కో చైర్మెన్ గా, సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీని కన్వీనర్ గా నియమించింది.

37 మందితో ఎగ్జిక్యూటీవ్ కమిటీని నియమించిన AICC ప్రత్యేక ఆహ్వానితులుగా, PCC అధ్యక్షుడు, CLP నాయకుడు, PCC వర్కింగ్ ప్రసిడెంట్స్, MP, MLA, MLCలు, మాజీ MP, MLA, MLCలు, కాంగ్రెస్ అనుబంద సంఘాల అధ్యక్షులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఉంటారు.