HomeTelanganaPolitics

కేటీఆర్, కవితలపై గవర్న‌ర్ కు లేఖరాసిన సుఖేశ్ చంద్రశేఖర్… వాడో క్రిమినల్, ఫ్రాడ్ అని కేటీఆర్ మండిపాటు

కేటీఆర్, కవితలపై గవర్న‌ర్ కు లేఖరాసిన సుఖేశ్ చంద్రశేఖర్… వాడో క్రిమినల్, ఫ్రాడ్ అని కేటీఆర్ మండిపాటు

రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు లేఖ రాశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవ

తెలంగాణ గవర్నర్ కు వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికుల నిరసన – ఆగిన‌ బస్సులు
తెలంగాణ గవర్నర్ కు వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికుల నిరసన‌ – ఆగిన‌ బస్సులు
దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించిన గవర్నర్

రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు లేఖ రాశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌పై సుకేష్ చంద్రశేఖర్ మరో సంచలన ఆరోపణలు చేశాడు. ‘‘నా వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని కవిత, కేటీఆర్ సన్నిహితులు ఒత్తిడి చేస్తున్నారు. కవితపై ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాలకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఆధారాలు ఇస్తే రూ.100 కోట్ల నగదు, శంషాబాద్‌లో స్థలం, అసెంబ్లీ సీటు ఇస్తామని ఆశ చూపుతున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. కవితకు నాకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ మొత్తం రికార్డింగ్ ఉంది. ఈ సాక్ష్యం ఇప్పటికే 65-B సర్టిఫికేట్ రూపంలో ED కి ఇచ్చాను. కవిత నుంచి రూ.15 కోట్ల నగదు తీసుకుని అరవింద్ కేజ్రీవాల్ తరఫున వారికి అందజేశాను. ఈ అంశాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతున్నాను.” అని సుఖేష్ తన లేకలో పేర్కొన్నారు.

కాగా సుఖేష్ చంద్రశేఖర్ లేఖపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. సుఖేష్ అబద్దాలు చెప్పే మోసగాడు. ప్రముఖ నేరస్థుడు అలాంటివాడు నాపై హాస్యాస్పదమైన ఆరోపణలు చేశాడని మీడియా ద్వారా తెలిసింది.

నేను ఈ రోగ్ గురించి ఎన్నడూ వినలేదు. అతని అర్ధంలేని మాటలపై అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను.

ఇటువంటి వ్యక్తులు చేసే దారుణమైన ఆరోపణలను ప్రచురించేటప్పుడు మీడియా కూడా జాగ్రత్తగా ఉండాలని అభ్యర్థిస్తున్నాను.” అని కేటీఆర్ ట్వీట్ చేశారు.