HomeCinema

కష్ట‌పడ్డా, సిన్మాలుదీసిన…. మంత్రి మల్లారెడ్డిని అనుకరించిన హీరో నవీన్ పోలిశెట్టి

కష్ట‌పడ్డా, సిన్మాలుదీసిన…. మంత్రి మల్లారెడ్డిని అనుకరించిన హీరో నవీన్ పోలిశెట్టి

''కష్టపడినా, పాలు అమ్మిన, పూలు అమ్మిన‌, కాలేజీలు పెట్టిన'' అనే డైలాగ్ ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయిన విషయం తెలిసిందే. తెలంగాణ మంత్రి మల్లా రెడ్

హిమాన్షు అన్నా ప్లీజ్ మా స్కూల్ నూ దత్తత తీసుకోవా !
‘తోటి విద్యార్థులను కులము, మార్కులు అడగొద్దు’
గ్రూప్ 2 పరీక్షలు వాయిదా… కేసీఆర్ ఆదేశాలు

”కష్టపడినా, పాలు అమ్మిన, పూలు అమ్మిన‌, కాలేజీలు పెట్టిన” అనే డైలాగ్ ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయిన విషయం తెలిసిందే. తెలంగాణ మంత్రి మల్లా రెడ్డి చెప్పిన ఈ డైలాగ్ సో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అనేక మంది దీని మీద మీమ్స్ కూడా సృష్టించారు.

ఇప్పుడు ఆయనను అనుకరిస్తూ టాలీ వుడ్ హీరో నవీన్ పోలిశెట్టి చెప్పిన డైలాగ్ సోషల్ మీడిఒయాలో వైరల్ అయ్యింది.

నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి ప్రస్తుతం రాబోయే చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కోసం కలిసి పని చేస్తున్నారు. మహేష్ బాబు.పి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ మరియు ప్రమోద్‌లు నిర్మించారు. ఆగస్ట్ 4న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే నవీన్ పొలిశెట్టి ప్రస్తుతం కాలేజీలకు వెళ్లి తన సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. తాజాగా మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి వెళ్లిన నవీన్ పొలిశెట్టి.. మంత్రి మల్లారెడ్డిని అనుకరించారు.

మల్లారెడ్డి అంటే తనకు ఇష్టమని నవీన్ పొలిశెట్టి పేర్కొన్నాడు. ఆ కాలేజీలో విద్యార్థులన్ ఉద్దేశించి మాట్లాడిన నవీన్ పొలిశెట్టి తన సినిమా ప్రమోషన్ కోసం మల్లా రెడ్డి డైలాగులను అనుకరించాడు. ”నేను కష్టపడ్డ, స్క్రిప్ట్‌లు రాసుకున్న, యూట్యూబ్‌లో వీడియోలు చేశిన.,అనుష్క శెట్టితో సినిమా తీశిన. విజయం సాధించిన.” అని ఆయన చెప్పిన డైలాగుతో మల్లా రెడ్డి కాలేజీ ఆడిటోరియం ద్దరిల్లి పోయింది. విద్యార్థినీ, విద్యార్థులు నవీన్ చెప్పిన డైలాగుకు ఈలలేస్తూ చప్పట్లు కొడుతూ ఆయనను ప్రోత్సహించారు. మంత్రిని అనుకరిస్తూ నవీన్ పొలిశెట్టి మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలో తులసి, మురళీ శర్మ, జయసుధ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.