HomePoliticsNational

బుల్డోజర్ రాజ్యంలో ఈ వృద్దులు, మహిళలు చేసిన పాపమేంటి ? తప్పు ఒకరు చేస్తే మరొకరిని రోడ్డుపాలు చేస్తారా ?

బుల్డోజర్ రాజ్యంలో ఈ వృద్దులు, మహిళలు చేసిన పాపమేంటి ? తప్పు ఒకరు చేస్తే మరొకరిని రోడ్డుపాలు చేస్తారా ?

అనారోగ్యంతో మంచానపడ్డ 80 ఏళ్ళ వృద్దురాలు, ముగ్గురు చిన్నపిల్లలు, ఐదుగురు ఆడవాళ్ళు…వీళ్ళందరినీ ఇంట్లో నుంచి బైటికి గెంటేసి బుల్డోజర్ తో ఆ ఇల్లును కూల్

అతిపెద్ద ఎజెండాతో పవనానందుల వారు వేంచేశారు
ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన: హైదరాబాద్ లో కేంద్ర ఎన్నికల సంఘం బిజీ సమావేశాలు
బిజెపి విధానాలు దేశంలో హింస, హక్కుల దుర్వినియోగానికి దారితీశాయి -హ్యూమన్ రైట్స్ వాచ్

అనారోగ్యంతో మంచానపడ్డ 80 ఏళ్ళ వృద్దురాలు, ముగ్గురు చిన్నపిల్లలు, ఐదుగురు ఆడవాళ్ళు…వీళ్ళందరినీ ఇంట్లో నుంచి బైటికి గెంటేసి బుల్డోజర్ తో ఆ ఇల్లును కూల్చేసింది మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం.

ఆ ఇల్లేమీ అనుమతి లేకుండా కట్టిన ఇల్లు కాదు. చట్టబద్దంగా అనేక తరాల నుంచి ఉన్న ఇల్లు అది. మరెందుకు ప్రభుత్వం ఈ చట్టవ్యతిరేక బుల్డోజర్ చర్యకు పాల్పడింది ? వృద్దులను, ఆడవాళ్ళను, పిల్లలను రోడ్డుపాలు చేసింది ?

మధ్యప్రదేశ్ లోని సిద్ది జిల్లా కుబ్రి గ్రామంలో దస్మత్ రావత్ అనే ఆదివాసీ యువకుడి మొహంపై బీజేపీ నాయకుడు ప్రవేష్ శుక్లా అనే వ్యక్తి మూత్రం పోసిన సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు వచ్చాయి. అస్లె త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వెంటనే మేలుకున్న ముఖ్యమంత్రి ఈ సంఘటనపై తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు ప్రవేశ్ శుక్లాను అరెస్టు చేసి జైలుకు పంపించారు. అక్కడితో ఆగని ప్రభుత్వం ఒక దుర్మార్గ చర్యకు తెరలేపింది. ప్రవేశ్ శుక్లా తండ్రి ఇంటిని బుల్డోజర్ తో కూలగొట్టించింది. ఇది చట్ట వ్యతిరేక చర్య అని అనేక విమర్శలు వచ్చినప్పటికీ ఎన్నికల్లో ప్రయోజనం పొందడమే లక్ష్యంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ క్రూరమైన చర్యకు దిగింది.

దాంతో ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న వృద్దులు, మహిళలు, పిల్లలు రోడ్డు పాలయ్యారు. కూలిపోయిన ఇంటి పక్కన రోడ్డు మీదనే బతకాల్సి వస్తోంది.

నిందితుడు ప్రవీష్ శుక్లా తండ్రి రమాకాంత్ శుక్లా మీడియా ముందుకు వచ్చారు. కొడుకు చేసిన పనికి కఠినంగా శిక్షించాలని అన్నారు. కానీ కొడుకు చేసిన నేరం కారణంగా ప్రభుత్వం మా ఇంటిని కూల్చివేసింది. ఇప్పుడు మా కుటుంబ సభ్యులందరూ రోడ్డునపడ్డారు. బుల్డోజర్ న్యాయం ఎంత వరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. ‘‘చట్టం ప్రకారం విచారణ జరగనివ్వండి. నా కొడుకు దోషిగా తేలితే కఠినంగా శిక్షించాలి. అయితే ఇంటిని కూల్చడం ఏంటి? ఇంటి ఆడవాళ్ళు ఎక్కడుండాలి? నా ముసలి తల్లికి 80 ఏళ్లు. ముగ్గురు మనవలు, కోడలు ఉన్నారు. వాళ్లంతా ఎక్కడికి వెళ్లాలి… ఎక్కడ తల దాచుకోవాలి?’ అంటూ బోరుమన్నారు రమాకాంత్.

‘ప్రభుత్వం కూల్చిన ఈ ఇల్లు ప్రవేశ్‌ది కాదు, అతని స్థలం కూడా కాదు. ఈ ఇల్లును తన డబ్బుతో కట్టలేదు. ఈ ఇల్లు మా తాతల నుంచి వారసత్వంగా వచ్చింది’ అని రమాకాంత్ చెప్పారు. ఎంత చెప్పినా ప్రభుత్వ యంత్రాంగం వినకుండా తన ఇంటిని కూల్చివేసిందన్నారు. “నా ఇంటిని కూల్చివేయడం పూర్తిగా అన్యాయం. తప్పు చేసినట్లు తేలితే కొడుకును ఉరి తీయాలని రమాకాంత్ అన్నారు.

బుల్డోజర్‌తో ఇంటిని కూల్చివేయడాన్ని కోల్ గిరిజన సంఘం సభ్యులు కూడా ఖండించారు. ఇంటిని కూల్చడం చాలా తప్పు.. అన్నారు. ‘పక్షి గూడు చెదిరిపోతేనే తట్టుకోలేం. ప్రభుత్వం మహిళలు, పిల్లలు, వ్ఱ్ఱ్ద్దులు నివసించే ఇళ్లను కూల్చివేయడం దారుణమని ఓ సభ్యుడు అన్నారు.

ఒకరు తప్పు చేస్తే కుటుంబం మొత్తానికి శిక్ష ఏమిటని , ప్రజల కోపాన్ని నివారించడానికి లేదా ఇతర కారణాల వల్ల బుల్డోజర్ న్యాయాన్ని అమలు చేయడానికి ప్రభుత్వానికి చట్టపరమైన అధికారాలు ఉన్నాయా అని వస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి ఉంది. .

మరో వైపు బాధితుడు దస్మత్ రావత్ ప్రవేశ్ శుక్లా పట్ల తన ఉదారతను ప్రదర్శించాడు. ”ఈ సంఘటన తర్వాత ప్రవేశ్ శుక్లా తన తప్పును గ్రహించాడు. అతను తీవ్రమైన తప్పు చేసి ఉండవచ్చు. కానీ జరిగిందేదో జరిగింది, అతన్ని వదిలేయండి’.. అని మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని రావత్ కోరారు.

బీజేపీ నేత ప్రవేశ్ శుక్లా చేసింది తీవ్రమైన నేరం. అతను చేసిన నేరానికి అతన్ని కఠినంగా శిక్షించాల్సిందే. అయితే ఇందులో ప్రవేశ్ శుక్లా కుటుంబాన్ని శిక్షించడం ఎంత వరకు న్యాయమనే ప్రశ్నలకు బీజేపీ ప్రభుత్వ జవాబు చెప్పాల్సి ఉన్నది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ బుల్డోజర్ రాజ్యాంగం ఈ దేశ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిదనే వ్యాఖ్యలు వస్తున్నాయి. తమ ఓట్ల రాజకీయాల కోసం ప్రజలను రోడ్లపాలు చేయడాన్ని బీజేపీ ఎలా సమర్దించుకోగలదో వేచి చూడాలి.