HomePoliticsNational

శ‌రద్ పవార్ కు భారీ షాక్ …బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్

శ‌రద్ పవార్ కు భారీ షాక్ …బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్

మహారాష్ట్రలో రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నిట్టనిలువుగా చీలిపోయింది. ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ కు ద

నటి రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో ప్రధాన నిందితుడి అరెస్ట్
హోటల్ లో 6 లక్షల బిల్లు చేసిన ఆంధ్రా మహిళ… ఆమె దగ్గర ఉన్నది 41 రూపాయలే …హోటల్ సిబ్బంది ఏం చేశారు ?
ప్రతిష్టాత్మకమైన ‘ఆదిత్య L1’ ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో

మహారాష్ట్రలో రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నిట్టనిలువుగా చీలిపోయింది. ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ కు దగ్గరి బంధువైన అజిత్ పవార్ ఎన్సీపీ చీల్చి బీజేపీతో చేతులు కలిపారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సిఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ల శివసేన-భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ కూటమిలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

పవార్‌తో పాటు ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే-పాటిల్, హసన్ ముష్రీఫ్, ధనంజయ్ ముండే, ధర్మారావు బాబా అత్రమ్, అదితి సునీల్ తత్కరే, సంజయ్ బన్సోడే, అనిల్ పాటిల్ వంటి సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు కూడా ఈ మధ్యాహ్నం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడం మూడేళ్లలో ఇది మూడోసారి – మొదట 2019లో అప్పటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా 80 గంటల పాటు కొనసాగిన పాలనలో, తర్వాత మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో, మళ్ళీ ఇప్పుడు బీజేపీ, శివసేన షిండే ప్రభుత్వ‍ంలో.

మహారాష్ట్రకు ఇద్దరు డిప్యూటీ సిఎంలు (ఫడ్నవీస్, అజిత్ పవార్)ఉండటం కూడా చరిత్రలో ఇదే మొదటిసారి.

ఈ పరిణామాలపై స్పందిస్తూ, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్ పూణేలోని తన సన్నిహితులతో మాట్లాడుతూ, “ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పార్టీ మద్దతు ఇవ్వదు” అని స్పష్టం చేశారు.

అజిత్ పవార్తో చేతులు కలిపిన‌ వారిలో 80 శాతం మంది అతి త్వరలో ఎన్‌సిపిలోకి తిరిగి వస్తారని కూడా పార్టీ పేర్కొంది.

శివసేన (యుబిటి) ఎంపి, ప్రధాన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ మాట్లాడుతూ, ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన అందరు మంత్రులపై తీవ్రమైన ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. వారందరినీ జైల్లో పెడతామని బీజేపీ బెదిరించి వారందరినీ తమవైపు తిప్పుకున్నారని రౌత్ అన్నారు.

రాష్ట్రంలో పటిష్టమైన పాలన అందించేందుకు తమ ప్రభుత్వంలో చేరేందుకు అజిత్ పవార్ తీసుకున్న నిర్ణయాన్ని శివసేన-బీజేపీ అగ్రనేతలు స్వాగతించారు.

పవార్ తీసుకున్న చర్య ఇప్పుడు ప్రభుత్వానికి ‘ట్రిపుల్ ఇంజిన్’ ఇస్తుందని, రాష్ట్ర ప్రగతికి బుల్లెట్ రైలు వేగంతో పరిపాలన సాగుతుందని షిండే అన్నారు.

“నేను శరద్ పవార్‌తో మాట్లాడాను. మేము బలంగా ఉన్నాము. మాకు ప్రజల మద్దతు ఉంది. ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి మళ్లీ అన్నింటినీ పునర్నిర్మిస్తాం. ప్రజలు ఈ ఆటను ఎక్కువ కాలం సహించరు” అని రౌత్ ప్రకటించారు.

కాగా ఈరోజు మధ్యాహ్నం, అజిత్ పవార్, పలువురు ఎన్‌సిపి నాయకులతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ రమేష్ బైస్‌ను కలుసుకుని, మూడు డజన్ల మంది ఎమ్మెల్యేలు సంతకం చేసిన మద్దతు లేఖను అందజేశారు.

వెంటనే షిండే, ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే, అధికార కూటమికి చెందిన ఇతర సీనియర్ నేతలు కూడా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.

అజిత్ పవార్, చగన్ భుజబల్ సహా మరి కొందరు కొత్తగా చేరిన మంతృలతో గవర్నర్ కొద్ది సేపటి క్రితం ప్రమాణస్వీకారం చేయించారు.