HomeTelanganaPolitics

అనుచరుడి హత్యతో భగ్గుమన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి….ఇది బీఆరెస్ పనే అని ఆరోపణ‌

అనుచరుడి హత్యతో భగ్గుమన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి….ఇది బీఆరెస్ పనే అని ఆరోపణ‌

జగిత్యాల, అక్టోబర్ 22: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు దారుణ హత్యకు గురయ్యారు. దాంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డు పై బైఠ

బీజేపీకి బిగ్ షాక్:బీఆరెస్ లోకి దత్తత్రేయ‌ కూతురు?
రేవంత్ రెడ్డిని కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!
ఏప్రెల్ లో లోక్ సభ ఎన్నికలు – ‍ స్పష్టం చేసిన కిషన్ రెడ్డి

జగిత్యాల, అక్టోబర్ 22: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు దారుణ హత్యకు గురయ్యారు. దాంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డు పై బైఠాయించి రాస్తారోకో చేస్తున్నారు. మారు గంగారెడ్డి జీవన్ రెడ్డికి కుడి భుజం లాంటి వాడు. ఇతను కొద్దిరోజుల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ గా కావలసి ఉండింది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సొంత సోదరడు గా భావించే జాప్తాపూర్ గ్రామానికి చెందిన మారు గంగారెడ్డిని మంగళవారం ఉదయం పక్కా ప్రణాళిక ప్రకారం హత్య చేశారు. దాంతో జగిత్యాల ప్రాంతం ఒక్కసారి ఉలిక్కిపడింది. నిందితులు ఓ కారులో వచ్చి గంగారెడ్డిని కారుతో గుద్ది ఆపై విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేసి హతమార్చి వేరే కారులో పరారయ్యారు.

కాగా, పోలీసుల వైఫల్యం వలన గంగారెడ్డి హత్య జరిగిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాత బస్టాండ్ చౌరస్తా వద్ద గ్రామస్తులతో కలిసి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఇది రాజకీయ కక్షలతో జరిగిన హత్యగా ఆరోపిస్తున్నారు అధికార పార్టీ కార్యకర్త హత్య జరగడం వెనుక ప్రతిపక్ష బీఆరెస్ హస్తం ఉందని, పోలీసులు ఇప్పటికీ బీఆరెస్ నేతల చెప్పుచేతుల్లో ఉన్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడుతున్నారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు రక్షణ లేకపోతే ఇక పార్టీని కార్యకర్తలను ఏ విధంగా కాపాడుకుంటామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.