HomeTelanganaPolitics

స్పీడ్ తగ్గించు… రేవంత్ కు హైకమాండ్ ఆదేశం!

స్పీడ్ తగ్గించు… రేవంత్ కు హైకమాండ్ ఆదేశం!

హైడ్రా, మూసీ ఇళ్ళ కూల్చివేతలపై తెలంగాణ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ హైకమాండ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏఐసీసీ పిలుపు మేరకు ఢిల్లీ వెళ్ళిన రేవంత్ ర

మధుయాష్కీ, పొంగులేటికి కాంగ్రెస్ లో కీలక పదవులు
55 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్
కాంగ్రెస్: 70 స్థానాల్లో అభ్యర్థులు ఫైనల్ , 30 సీట్లలో తీవ్ర పోటీ

హైడ్రా, మూసీ ఇళ్ళ కూల్చివేతలపై తెలంగాణ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ హైకమాండ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏఐసీసీ పిలుపు మేరకు ఢిల్లీ వెళ్ళిన రేవంత్ రెడ్డి సోమవారం ఎఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ లను కలిశారు. వారితో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఈ సమావేశాలలో, హైడ్రా కూల్చివేతలపై, ప్రజలనుంచి పెరుగుతున్న విమర్శలపై, ముఖ్యంగా తెలంగాణ హైకోర్టు చేసిన ఘాటైన వ్యాఖ్యలపై ఎఐసిసి నాయకత్వం రేవంత్ రెడ్డిని అడిగినట్లు సమాచారం. అంతే కాదు జోరు తగ్గించుకోకపోతే పార్టీ నష్టపోవడం ఖాయమని వారు హెచ్చరించినట్టు తెలుస్తోంది.

తెలంగాణలో కూల్చివేతల ప్రభావం ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై పడి పార్టీ అవకాశాలకు గండి కొట్టే ప్రమాదముందని చెప్పినట్టు టాక్. అలాగే తెలంగాణలో రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా పార్టీ తీవ్రంగా నష్టపోతుందని అందువల్ల ఈ చర్యలను ఉపసంహరించుకోవాలని, కార్యక్రమాలను తగ్గించాలని ముఖ్యమంత్రికి హైకమాండ్ సూచించినట్లు సమాచారం.