HomeTelanganaPolitics

రేవంత్ పై కాంగ్రెస్ కీలక నేత తిరుగుబాటు.. ఆయన వెనక మరికొంత మంది సీనియర్లు?

రేవంత్ పై కాంగ్రెస్ కీలక నేత తిరుగుబాటు.. ఆయన వెనక మరికొంత మంది సీనియర్లు?

పీసీసీ అధ్యక్షుడి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నం చేసి విఫలమైన మధియాష్కీ ఆ రోజునుంచి రేవంత్ మీద మండిపోతూనే ఉన్నాడు. మొదటి నుంచీ ఆయన రేవంత్ కు వ్యతిరేకంగా

‘హైడ్రా’ తో రేవంత్ పై తీవ్ర వ్యతిరేకత‌
స్పీడ్ తగ్గించు… రేవంత్ కు హైకమాండ్ ఆదేశం!
FTL పరిధిలో ఉన్న తన‌ ఆస్తులు కాపాడుకోవడానికే హరీశ్ రావు ఆరాట‌మా ?

పీసీసీ అధ్యక్షుడి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నం చేసి విఫలమైన మధియాష్కీ ఆ రోజునుంచి రేవంత్ మీద మండిపోతూనే ఉన్నాడు. మొదటి నుంచీ ఆయన రేవంత్ కు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ పదవి రాకపోవడంతో మరింత రగిలిపోతున్నాడు. ఈ నేపథ్యంలో హైడ్రా, మూసీ కూల్చివేతల వివాదం ఆయనకు కలిసి వచ్చింది. దాంతో ఆయన ఒకరకంగా ప్రభుత్వంపై, ముఖ్యంగా రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు మొదలు పెట్టాడు. ఎన్ని అడ్డంకులొచ్చినా అధికారులు మూసీ నది ఎఫ్ టీఎల్, బఫర్ జీన్ పరిధిలో ఉన్న ఆస్తులను కూల్చివేయడం ఆపలేదు. దాంతో మూసూ కూల్చివేతలను ఆపడానికి పోరాటానికి సిద్దమయ్యాడు కాంగ్రెస్ నేత మధుయాసష్కీ. ఆయన మంగళవారం నాడు మూసీపరీవాహక ప్రాంతాల్లో పర్యటించాడు. మీ ఇళ్లపై ఎవరూ చేయి వేయరు. ఒక్క గడ్డపార, ఒక్క ప్రొక్లైనర్ కూడా రాదు. ఒకవేళ అన్యాయంగా మీ ఇళ్లపైకి వస్తే కోర్టుకు నేను వెళతా. కేసు వేసి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా. ఆందోళన చెందకుండా పిల్లాపాపలతో ప్రశాంతంగా నిద్రపోండి అని ధైర్యం చెప్పారు. అయితే మధుయాష్కీ చేస్తున్న ఈ తిరుగుబాటు వెనక మరికొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలున్నారన్న చర్చ సాగుతోంది. మరి ఈ అంశంలో అధిష్టానం ఏం చేస్తుందో వేచి చూడాలి.