ఢిల్లీలో పర్యాటకులకు మార్గనిర్దేశం చేసేందుకు సైకిల్-రిక్షా డ్రైవర్ ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజనుల నుండి
ఢిల్లీలో పర్యాటకులకు మార్గనిర్దేశం చేసేందుకు సైకిల్-రిక్షా డ్రైవర్ ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజనుల నుండి ప్రశంసలను పొందుతోంది. X లో ఓ నెటిజన్ షేర్ చేసిన ఈ వీడియోలో, విదేశీ పర్యాటకులకు ఢిల్లీలోని ప్రసిద్ధ ప్రదేశాల వివరాలను విదేశీయులకు రిక్షావాలా వివరిస్తున్నట్లుగా ఉంది.
వీడియోలో, ఇద్దరు బ్రిటన్ దేశస్థులు జామా మస్జిద్ చూసేందుకు ఓ కుర్రాడి రిక్షా ఎక్కారు. ఆ తరువాత రిక్షావాలా వారికి ఢిల్లీ గొప్పదనం గురించి మంచి ఇంగ్లిష్‌లో అద్భుతంగా చెప్పాడు. జామా మజీద్ గురించి, ఆసియాలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల మార్కెట్ గురించి చెప్పాడు. చిన్న చిన్న సందుల్లో కూడా మంచి షాపులు ఉంటాయని, ఇష్టమైతే షాపింగ్ కూడా చేద్దామని అతడు టూరిస్టులకు వివరించాడుదారిలో ఉన్న ఇరుకైన , చిన్న చిన్న వీధుల్లో వారు ఫోటోలు తీయాలనుకుంటున్నారా లేదా ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటున్నారా తనకు తెలియజేయాలని కూడా అతను వారికి సూచించాడు.
సోషల్ మీడియాలో ఈ వీడియో 11వేలకు పైగా వ్యూస్ను పొందింది. UK నుండి వచ్చిన పర్యాటకులకు మార్గనిర్దేశం చేసే వ్యక్తి పద్ధతికి సోషల్ మీడియా వినియోగదారులను పూర్తిగా ఆకట్టుకుంది. పోస్ట్‌కి పెద్ద ఎత్తున్ అలైక్ లు వచ్చాయి. నెటిజనులు అతని ఆంగ్లం మాట్లాడే నైపుణ్యానికి మెచ్చుకున్నారు.
An Indian 🇮🇳 rickshaw Wala is taking an British husband and wife from UK 🇬🇧 to Delhi and is also explaining the entire history to them in English. pic.twitter.com/mgoqtLzFcA
— Shubhangi Pandit (@Babymishra_) February 10, 2024