HomeTelanganaPolitics

‘కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్’ వ్యవహారం రచ్చ రచ్చ…కలగజేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

‘కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్’ వ్యవహారం రచ్చ రచ్చ…కలగజేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ లో మధ్యతరగతి ప్రజలకు, ఉద్యోగులకు రోడ్డుపక్కన ఫుడ్ స్టాల్స్ ఎంతో ఉపయోగపడుతున్నాయి. పెద్ద హోటల్ లో రోజూ తినలేని ఉద్యోగులు, ఇతరపనులు చేసే వాళ్

హ‌త్యాచారాలు, నగ్న ఊరేగింపులు…ఒకటి కాదు వందలు జరిగాయని స్వయంగా అంగీకరించిన మణిపూర్ సీఎం
రాహుల్ పై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం, జైరాం రమేష్, అస్సాం యూనిట్ పీసీసీ చీఫ్ పై దాడి
ప్రగతి భవన్ నుంచి ఎప్పటికప్పుడు వరదల పరిస్థితిని సమీక్షిస్తున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్ లో మధ్యతరగతి ప్రజలకు, ఉద్యోగులకు రోడ్డుపక్కన ఫుడ్ స్టాల్స్ ఎంతో ఉపయోగపడుతున్నాయి. పెద్ద హోటల్ లో రోజూ తినలేని ఉద్యోగులు, ఇతరపనులు చేసే వాళ్ళు ఈ ఫుడ్ స్టాల్స్ కు మంచి గిరాకి. ఈ మధ్య సోషల్ మీడియాలో ఇటువంటి ఫుడ్ స్టాల్ ఒకటి బాగా ఫేమస్ అయ్యింది. ‘కుమారి ఆంటీ’ ఫుడ్ స్తాల్ పేరుతో యూట్యూబ్ ల్లో ఫేమస్ అయిన కుమారి ఆంటీ ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు వలస వచ్చారు. మాదాపూర్ లో చిన్నగా ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు.

కుమారి సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాక ఆమె దగ్గరకి తినడానికి వచ్చేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. దాంతో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందంటూ పోలీసులు ఈ రోజు ఆమె ఫుడ్ స్టాల్ ను మూసి వేశారు. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నేపథ్యంలో ఇది జరిగింది.

పోలీసులు ఆమెను ఒక వారం పాటు తన స్టాల్‌ను మూసివేయమని అడిగారు. ఆమె స్టాల్‌కు మరింత అనువైన స్థలాన్ని గుర్తించడానికి గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారుల నుండి సహాయం తీసుకోవాలని ఆమెకు సలహా ఇచ్చారు.
ఈ అంశంపై రాయదుర్గం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ గణేష్ పటేల్ మాట్లాడుతూ, “ఆమెకు స్టాల్ నడపడానికి ఎలాంటి అనుమతి రాలేదు. ఇది ఫుట్‌పాత్ పై ఉంది. వీడియోలను రికార్డ్ చేయడానికి చాలా మంది యూట్యూబర్‌లు ఈ స్థలాన్ని సందర్శిస్తున్నారు. ఈ స్టాల్ ఐటీ సెక్టార్ స్ట్రెచ్‌లో చాలా రద్దీని కలిగించింది.” అన్నారు.

కుమారి మీడియాతో మాట్లాడుతూ, “నేను దాదాపు 13 సంవత్సరాలుగా ఇక్కడ నా స్టాల్ నడుపుతున్నాను. ఐటీ ఉద్యోగులు, దినసరి కూలీలు నా దగ్గరి నుంచే ఆహారం తీసుకుంటారు. నా కస్టమర్‌లు తమ వాహనాలను ఇక్కడ పార్క్ చేయవద్దని కూడా కోరాను.” అన్నారు.

అంతేకాకుండా తన స్టాల్ ను మాత్రమే మూసి వేశారని మిగతావాళ్ళవి అలాగే ఉంచారని కుమారి అన్నారు.

ఆమె ఆరోపణపై ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ, “ఆ స్ట్రెచ్‌లో మరో 10 ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అయితే, ఈ యజమానులు హైకోర్టు నుండి స్టే ఆర్డర్ తీసుకున్నారు. అందుకే మేము వాటిని క్లియర్ చేయలేకపోయాము. అయితే ఇదే విషయమై జీహెచ్‌ఎంసీ అధికారులకు లేఖ పంపాం.” అన్నారు.

కాగా, మీడియా పాపులారిటీ వల్లే తమకు ఈ పరిస్థితి వచ్చింద‌ని తన భర్త మనస్తాపం చెందాడని కుమారి ఆంటీ వెల్లడించింది.
కాగా, ఈ వ్యవహారం సోషల్ మీడియా పెద్ద చర్చకు దారి తీసింది. ఆమెకు మద్దతుగా నెటిజనులు పోస్టులు చేశారు. ఇక ఏపీలో నైతే ఈ అంశం వైసీపీ, టీడీపీ లమధ్య సోషల్ మీడియా వార్ కు దారి తీసి‍ంది. కుమారి ఆంటీ ఒక ఇంటర్వ్యూలో, తనకు జగన్ ఓ ఇల్లు ఇచ్చాడని చెప్పింది. ఈ మాటను ఉదహరణగా చూపిస్తూ సోషల్ మీడియాలో వైసీపీ ఫ్యాన్స్ టీడీపి పై, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. జగన్ కు అనుకూలంగా మాట్లాడిందనే కోపంతో తెలంగాణ ప్రభుత్వాన్ని ఉసిగొల్పి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు కుమారి ఆంటీపై కక్ష సాధించారని ఆరోపించారు.

అయితే ఈ వ్యవహారం మరింత దూరం పోకముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలగజేసుకున్నారు. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను తొలగించవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఎక్కడైతే ఆమె వ్యాపారం చేసుకుందో ఇకపైనా అదే స్థలంలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కొనసాగించుకునేలా చూడాలని స్పష్టం చేశారు. అక్కడ ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డి సీపీఆర్వో అయోధ్య రెడ్డి బుధవారం ట్వీట్ చేశారు.