ఒకవైపు త్వరలో బీఆరెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారని తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ రోజు ఆసక్తికర సమా
ఒకవైపు త్వరలో బీఆరెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారని తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ రోజు ఆసక్తికర సమావేశం జరిగింది. బీఆరెస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు.
ఈ రోజు మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు… నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావులు ముఖ్యమంత్రి నివాసంలో రేవంత్ ను కలిశారు. అయితే వీళ్ళు కలిసింది పార్టీ మార్పులో భాగంగా కాదు. మెదక్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారట. తమ తమ నియోజకవర్గాలలోని సమస్యలను వారు ముఖ్యమంత్రికి విన్నవించారని తెలుస్తోంది.
అయితే వీరు నలుగురు ముఖ్యమంత్రిని కలిసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Four BRS MLAs paid a courtesy call to Chief Minister Shri Revanth Reddy at his residence
— Congress for Telangana (@Congress4TS) January 23, 2024
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), కొత్త ప్రభాకర్ రెడ్డి (దుబ్బాక) , గూడెం మహిపాల్ రెడ్డి (పఠాన్… pic.twitter.com/upnjUl9Ccm