HomeTelanganaPolitics

10 ఎంపీ సీట్లు సాధించడమే లక్ష్యంగా తెలంగాణకు RSS నాయకుడి రాక‌

10 ఎంపీ సీట్లు సాధించడమే లక్ష్యంగా తెలంగాణకు RSS నాయకుడి రాక‌

కొంతమంది సీనియర్ నేతల మధ్య కొనసాగుతున్న వైషమ్యాలకు స్వస్తి పలికి, పార్టీ నేతల మధ్య సమన్వయం మరింత మెరుగ్గా ఉండేలా బీజేపీ అధిష్టానం తెలంగాణకు గట్టి టాస

మంద కృష్ణ ఎన్ని కోట్లు తీసుకున్నాడు? కేఏ పాల్ బహిర్గత పర్చిన లెక్కలేంటి ?
తెలంగాణకు జాతీయ పసుపు బోర్డు… ప్రకటించిన ప్రధాని మోడీ
నోరు మూసుకోక పోతే ఇంటికి ఈడీని పంపుతా – విపక్షాలకు కేంద్ర మంత్రి హెచ్చరిక‌

కొంతమంది సీనియర్ నేతల మధ్య కొనసాగుతున్న వైషమ్యాలకు స్వస్తి పలికి, పార్టీ నేతల మధ్య సమన్వయం మరింత మెరుగ్గా ఉండేలా బీజేపీ అధిష్టానం తెలంగాణకు గట్టి టాస్క్‌మాస్టర్‌, ఆర్‌ఎస్‌ఎస్ నేత చంద్రశేఖర్‌ను పంపుతున్నట్లు సమాచారం.

ఇటీవల జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో చంద్రశేఖర్ తెరవెనుక కీలక పాత్ర పోషించారు.
చంద్రశేఖర్‌ను తెలంగాణ బీజేపీ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజింగ్)గా నియమించారు. లోక్‌సభ ఎన్నికలకు వ్యూహాలు , విధానాలను రూపొందించడంలో ఆయన ప్రధాన వ్యక్తిగా ఉంటారు. ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులైన తర్వాత చంద్రశేఖర్ తొలిసారిగా బుధవారం హైదరాబాద్‌కు వచ్చి రాష్ట్ర సీనియర్ నేతలతో చర్చించనున్నారు.

ప్రధానంగా అంతర్గత పోరు, సీనియర్‌ నేతల మధ్య సమన్వయ లోపం కారణంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో చంద్రశేఖర్‌ ఈ రెండు అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని చక్కదిద్దాలని, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచాలని పార్టీ కేంద్ర నాయకత్వం కోరినట్లు సమాచారం.

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వర్గాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో చంద్రశేఖర్ ఇరువురు నేతలతో సవివరంగా చర్చించే అవకాశం ఉంది.

సీనియర్ నేతల మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్నయుద్ధం కారణంగా పలు నియోజకవర్గాల్లో పార్టీ పునాదిని బలోపేతం చేసుకోవడం కష్టంగా మారింది.
నేతల మధ్య నెలకొన్న అంతర్గత పోరు వల్ల అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీకి అనేక స్థానాలు కోల్పోయామ‌ని, లోక్‌సభ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు చంద్రశేఖర్‌ను పంపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

నిజానికి, లోక్‌సభ ఎన్నికల సమయంలో పార్టీలోని వివిధ వర్గాల నుంచి ఇబ్బందులు తలెత్తుతాయనే భయంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి జిల్లా అధ్యక్షులందరినీ మార్చారు. చంద్రశేఖర్‌ నియామకం పార్టీని ముందుకు నడిపించేందుకు కిషన్‌రెడ్డికి ఉపయోగపడే అవకాశం ఉంది.

లోక్‌సభ ఎన్నికల్లో 10 సీట్లకు పైగా గెలుపొందాలని బిజెపి హైకమాండ్ పార్టీ రాష్ట్ర యూనిట్‌కి లక్ష్యంగా పెట్టింది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి నాయకులు, కార్యకర్తల మధ్య మరింత సమన్వయం అవసరం, కాబట్టి చంద్రశేఖర్ పాత్ర చాలా కీలకం అవుతుంది. .

ఉత్తరప్రదేశ్‌లోని బండా జిల్లాకు చెందిన చంద్రశేఖర్ మొదట ఆర్‌ఎస్‌ఎస్ లో విభాగ ప్రచారక్‌గా ఎదిగారు. నరేంద్ర మోడీ వారణాసి లోక్‌సభ నుంచి పోటీ చేసి ప్రధానమంత్రిగా ఎన్నికైన సందర్భంలో అక్కడ చంద్రశేఖర్ బీజేపీ ప్రధాన కార్యదర్శి (సంస్థ)గా ఉన్నారు.

గతంలో శ్రీనివాస్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉండగా, పంజాబ్, హర్యానా ఆర్గనైజింగ్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. అప్పటి నుంచి తెలంగాణ బీజేపీ బృందానికి ఆర్గనైజింగ్ సెక్రటరీ లేకపోవడంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఆధ్వర్యంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది.