నందమూరి కుటుంబంలో విభేదాలు మరో సారి బైటపడ్డాయి. ఎన్టీఆర్ సమాధి సాక్షిగా బాలకృష్ణ అనుచరులు చేసిన పనితో కుటుంబంలోని విభేదాలు రచ్చకెక్కాయి. ఎన్టీఆర్
నందమూరి కుటుంబంలో విభేదాలు మరో సారి బైటపడ్డాయి. ఎన్టీఆర్ సమాధి సాక్షిగా బాలకృష్ణ అనుచరులు చేసిన పనితో కుటుంబంలోని విభేదాలు రచ్చకెక్కాయి.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేశారు. ఇంతలో అక్కడికి సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ వచ్చారు. ఆయన తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించి అనంఅత్రం తన అనుచరులకు ఏదో చెప్పి వెళ్ళిపోయారు. ఆయన కారు అటు పూర్తిగా వెళ్ళకముందే బాలకృష్ణ అనుచరులు ఎన్టీఆర్ ఫ్లెక్సీలను అక్కడి నుంచి తొలగించారు.
అయితే ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడంపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఎన్టీఆర్ తన తాతకు నివాళులు అర్పిస్తూ ఫ్లెక్సీలు పెట్టడం కూడా తప్పేనా అని ప్రశ్నిస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ తో బాలకృష్ణకు ఎప్పుడూ సరైన సంబంధాలు లేవని అందరికీ తెలుసు అయితే ఈ మధ్య చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పంధించకపోవడం చంద్రబాబుకు, బాలకృష్ణకు బాగా కోపం తెప్పించిందని సమాచారం.
కాగా, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడంపై మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. వాళ్లది నీచాతినీచమైన బుద్ధి. వెయ్యిమంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ను ఏం చేయలేరు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన ఏమీ చేయలేరు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వారు ఎన్టీఆర్ వర్ధంతి చేస్తారా?’’ అంటూ కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
is this true?😳 pic.twitter.com/pDbKKTWqGn
— 🔥DEVARA⚡ (@sri2ntr) January 18, 2024