HomeNational

బీఆరెస్ కు గుడ్ బై-కాంగ్రెస్ లో చేరిన ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్

బీఆరెస్ కు గుడ్ బై-కాంగ్రెస్ లో చేరిన ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్

గతంలో కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రిగా పని చేసి అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరి అక్కడా సరిపడక ఈ మధ్యనే కేసీఆర్ నాయకత్వంలోనే బీఆరెస్ లో చేరిన ఒడిశా మాజీ

BJP, BRS, MIM ల మధ్య సీట్ల ఒప్పందం జరిగిందా ?
తెలంగాణలో హంగ్ వస్తే బీఆరెస్, బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుందా ?
300 మంది యువకులకు భజరంగ్ దళ్ సాయుధ శిక్షణ

గతంలో కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రిగా పని చేసి అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరి అక్కడా సరిపడక ఈ మధ్యనే కేసీఆర్ నాయకత్వంలోనే బీఆరెస్ లో చేరిన ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ బీఆరెస్ కు రాజీనామా చేసి న్ కాంగ్రెస్ లో చేరారు.
గమాంగ్ 1972 , 2004 మధ్య కోరాపుట్ నుండి తొమ్మిది సార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన‌ ఆయన తన భార్య హేమ, కుమారుడు శిశిర్‌తో కలిసి గ్రాండ్ ఓల్డ్ పార్టీలో చేరారు. 2015లో ఆయన కాంగ్రెస్ ను వీడి బీజేపీ లో చేరారు.

ఈ సందర్భంగా ట్విట్టర్ లో కాంగ్రెస్ ఓ పోస్ట్ చేసింది. “ఈరోజు, కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ , ఒరిస్సా కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ డాక్టర్ అజోయ్ కుమార్ సమక్షంలో, ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గిరిధర్ తో పాటు , శ్రీమతి హేమా గమాంగ్ , సంజయ్ భోయ్, శిశిర్ గమాంగ్ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమయ్యారు. మీ అందరికీ అభినందనలు.” అని పోస్ట్ లో కాంగ్రెస్ పేర్కొంది.